గడల అవినీతిపై విచారణ జరిపించాలి
ABN, First Publish Date - 2023-06-22T03:13:32+05:30
రాష్ట్రంలో ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ.. గిరిజన హక్కులను కాలరాస్తున్న హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అవినీతిపై సిటింగ్ న్యాయమూర్తి, సీబీఐతో విచారణ జరిపించాలని, ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని..
ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి
నంగారా భేరి లంబాడి హక్కుల
పోరాట సమితి, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్
పంజాగుట్ట, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ.. గిరిజన హక్కులను కాలరాస్తున్న హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అవినీతిపై సిటింగ్ న్యాయమూర్తి, సీబీఐతో విచారణ జరిపించాలని, ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని నంగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్), ఎస్టీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేశాయి. గడలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకుంటే ఈ నెల 30న వేలాది మందితో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఆయా సంఘాల నాయకులు హెచ్చరించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు జి.రాజేష్ నాయక్, ఆదివాసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర తదితరులు 30న తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి పోస్టరును ఆవిష్కరించారు. గడల శ్రీనివాసరావు అవినీతి, అక్రమాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజేష్ నాయక్ తెలిపారు. కరోనా సమయంలో కేంద్రం నుంచి వచ్చిన సుమారు రూ.200 కోట్లను పక్కదారి పట్టించాడని, ఆ డబ్బుతో ట్రస్ట్ పెట్టి కొత్తగూడెం నియోజకవర్గంలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలనే కాంక్షతోనేనని ఇదంతా చేస్తున్నాడన్నారు. కాంట్రాక్ట్ పద్థతిలో సమీప బంధువులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నాడని తెలిపారు. ఆయన విషయమై త్వరలోనే గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తామని, రాష్ట్రపతికి లేఖ రాస్తామని, జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Updated Date - 2023-06-22T03:13:32+05:30 IST