ఐదేళ్లకొకసారి కులవివక్షపైనా సర్వే జరగాలి
ABN, First Publish Date - 2023-08-28T04:41:04+05:30
జనగణనకు పదేళ్లకొకసారి సర్వే చేస్తున్నట్లుగానే అంటరానితనం, కుల వివక్షపైనా ఐదేళ్లకొకసారి సర్వేచేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ అన్నారు.
యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్‌దేవ్ థోరట్
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): జనగణనకు పదేళ్లకొకసారి సర్వే చేస్తున్నట్లుగానే అంటరానితనం, కుల వివక్షపైనా ఐదేళ్లకొకసారి సర్వేచేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ అన్నారు. ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేటు రంగంలోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధికావాలంటే వారి సాధికారతకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ దళిత్ సమ్మిట్ ఆదివారం ముగిసింది. దీనికి ముఖ్య అతిఽథిగా ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని తీర్మానించారు. ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు, గిరిజన స్త్రీలపై లైంగికదాడులు, హత్యలను జాతీయ దళిత్ సమ్మిట్ తీవ్రంగా ఖండించింది. తెలంగాణలోనూ దళిత, గిరిజన ఆదివాసీల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్క బాలమల్లేష్ ఆరోపించారు.
Updated Date - 2023-08-28T04:41:04+05:30 IST