ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం రేపటితో పూర్తి

ABN, First Publish Date - 2023-05-26T04:03:55+05:30

గవర్నర్‌ కోటా కింద ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 27న (శనివారం) ముగియనుంది. ఈ స్థానాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● గులాబీ బాస్‌ నిర్ణయంపై ఆశావహుల్లో ఉత్కంఠ

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ కోటా కింద ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 27న (శనివారం) ముగియనుంది. ఈ స్థానాల్లో ఎవరిని భర్తీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్‌ మదిలో ఎవరున్నారు? ఎమ్మెల్సీలుగా ఎవరిని నిర్ణయిస్తారన్నదానిపై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలైన రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌ పదవీ కాలం ముగియనుండటంతో వారి స్థానంలో కొత్త వారిని ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ గురువారం నాటికీ బీఆర్‌ఎస్‌ ప్రకటన వెలువడలేదు. దీంతో గులాబీ బాస్‌ఎవరిని ఎమ్మెల్సీలుగా నిర్ణయిస్తారోనని ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎంపికకు బిక్షమయ్యగౌడ్‌, ఘంటా చక్రపాణి, పీఎల్‌ శ్రీనివాస్‌, బండి రమేశ్‌, దాసోజుశ్రవణ్‌, విద్యార్థి నాయకుడు తుంగబాలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-05-26T04:03:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising