పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం
ABN, First Publish Date - 2023-01-28T00:59:23+05:30
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక నిరీక్షణ ఫలించింది. పదోన్నతులు, బదిలీల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి చివరి నాటికి బదిలీలు, పదోన్నతులు పూర్తికానున్నాయి. కాగా, జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో సుమారు 2,849 పోస్టులు అన్ని కేటగిరీల్లో ఉండగా, ప్రస్తుతం 616 ఖాళీలు ఉన్నాయి.
1,400 మంది ఉపాధ్యాయుల బదిలీకి అవకాశం
350మందికి పైగా పదోన్నతి
నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
భువనగిరి టౌన్, జనవరి 27: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక నిరీక్షణ ఫలించింది. పదోన్నతులు, బదిలీల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి చివరి నాటికి బదిలీలు, పదోన్నతులు పూర్తికానున్నాయి. కాగా, జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో సుమారు 2,849 పోస్టులు అన్ని కేటగిరీల్లో ఉండగా, ప్రస్తుతం 616 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో సుమారు 1,405 మందికి బదిలీ, 350 మందికి పైగా పదోన్నతి లభించనుంది. అయితే స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు జిల్లాల్లో ఇప్పటి వరకు పనిచేస్తున్న భార్యాభర్తలు ఇక నుంచి ఒకే ప్రాంతంలో పని చేసే అవకాశం కలగనుంది. జిల్లా ఖాళీల వివరాలు, తాత్కాలిక సీనియారిటీ జాబితా ఛ్ఛీౌడఛీఛీ.ఛజూౌజటఞ్టౌ.ఛిౌఝలో పొందుపరిచినట్టు విద్యాశాఖ జిల్లా అధికారులు తెలిపారు.
పాదర్శకంగా బదిలీలు, పదోన్నతులు : డాక్టర్ కె.నారాయణరెడ్డి, డీఈవో
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం. ఫిబ్రవరి 1 నాటికి ఒకే పాఠశాలలో ఐదేళ్లు పని చేసిన హెచ్‌ఎంలకు, ఎనిమిదేళ్లు పని చేసిన ఉపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి. అలాగే ఒకే పాఠశాలలో రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీలకు అర్హులు. మూడేళ్లలోపు ఉద్యోగ విరమణ ఉన్నవారికి తప్పని సరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. అనారోగ్యం, దివ్యాంగులు ప్రత్యేక కేటగిరీలో బదిలీని కోరవచ్చు. అందుకు జిల్లా మెడికల్ బోర్డు జనవరి 30లోపు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేసే ఉపాధ్యాయులపై శాఖాపర చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2023-01-28T00:59:26+05:30 IST