ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పీపుల్స్‌ మార్చ్‌’ను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-06-03T01:00:16+05:30

దేవరకొం డ నియోజకవర్గం లో ఈ నెల 7వ తేదీ నుంచి 10 వర కు కొనసాగే సీఎల్పీనేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ కోరారు. శుక్రవారం దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌

దేవరకొండ, జూన్‌ 2: దేవరకొం డ నియోజకవర్గం లో ఈ నెల 7వ తేదీ నుంచి 10 వర కు కొనసాగే సీఎల్పీనేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ కోరారు. శుక్రవారం దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భట్టి విక్రమార్క యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిండి, ఎస్‌ఎల్‌బీసీ, నక్కలగండి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 7న చందంపేట మండలం తెల్‌దేవరపల్లి పరిధిలోని నక్కలగండి ప్రాజెక్టు నుంచి భట్టి విక్రమార్క యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మూడు రోజుల పాటు దేవరకొండ నియోజకవర్గంలో పీపుల్స్‌ మార్చ్‌ కొనసాగుతుందని, నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు వడ్త్య రమే్‌షనాయక్‌, టీపీసీసీ సభ్యులు దూదిపాల వేణుధర్‌రెడ్డి, జాల నర్సింహరెడ్డి, సిరాజ్‌ఖాన్‌, యూనుస్‌, కొర్ర రాంసింగ్‌, ముక్కమళ్ల వెంకటయ్యగౌడ్‌, సతీ్‌షరెడ్డితోపాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising