ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Governor Tamilisai Soundararajan: ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

ABN, First Publish Date - 2023-06-02T02:28:18+05:30

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది యువత చేసిన త్యాగాల్ని స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు. ఐటీ, ఫార్మా, లైఫ్‌సైన్స్‌, వ్యవసాయ రంగాల్లో అగ్రగామిగా ప్రసిద్ది చెందిన తెలంగాణ రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధి మార్గంలో పురోగమిస్తుందని చెప్పారు. తెలంగాణ అలుపెరగని చైతన్యం రోజురోజుకు మరింత బలపడాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో వేడుకలు ప్రారంభం అవుతాయి. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రాజ్‌భవన్‌లోని దర్బారు హాల్‌లో గవర్నర్‌ తమిళిసై సామాన్య ప్రజలు, ప్రముఖులతో కలిసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పంచుకుంటారు. రాజ్‌భవన్‌లో జరిగే వేడుకలకు సామాన్య ప్రజలకు ఆహ్వానం ఉందని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2023-06-02T03:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising