ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ నిందితుల కేసు.. పోలీసులే హంతకులు!

ABN, First Publish Date - 2023-06-01T03:43:43+05:30

దిశ హత్యాచార ఘటన నిందితులపై తెలంగాణ పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అని యుఎస్‌ హ్యూమన్‌ రైట్స్‌ రిపోర్ట్‌-2022 పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురిని చంపి కట్టుకధలు.. అమెరికా సంస్థ నివేదిక

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): దిశ హత్యాచార ఘటన నిందితులపై తెలంగాణ పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అని యుఎస్‌ హ్యూమన్‌ రైట్స్‌ రిపోర్ట్‌-2022 పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికా ప్రతి ఏటా తన అధ్యయన నివేదికను విడుదలచేస్తుంది. భారతలో 2022 వరకు జరిగిన ప్రధాన సంఘటనలపై నివేదికను రూపొందించింది. ఇందులో తెలంగాణకు సంబంఽధించి నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రఽముఖంగా ప్రస్తావించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన వి.ఎ్‌స.సిర్పూర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ఽకమిషన్‌ ఎన్‌కౌంటర్‌ను పోలీసుల కట్టుకథగా అభివర్ణించిందని ఆ నివేదిక పేర్కొంది. ఎన్‌కౌంటర్‌లో నేరస్తులను శిక్షించేందుకు ప్రత్యేక న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ.. పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా తెలంగాణలో చోటుచేసుకున్న ఈ ఘటనతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఘటనలను ప్రస్తావించింది.

జైళ్లలో కనీస సౌకర్యాలు కరవు..

జైళ్లలో ఖైదీలకు వసతుల కల్పన భారతలో తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆ నివేదికలో ప్రస్తావించారు. తెలంగాణ జైళ్లు ఖైదీలతో నిండిపోయాయి. అనేక చోట్ల గరిష్ఠ సామర్థ్యం కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో ఖైదీలను ఉంచుతున్నారు. జైళ్లలో 77శాతం అండర్‌ట్రయల్‌ ఖైదీలని ఆ నివేదిక తెలిపింది. భారతలో ముస్లిం మహిళా జర్నలిస్టులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కొన్ని అతివాద సంస్థలు ఇంటర్‌నెట్‌, సోషల్‌మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని పేర్కొంది.

Updated Date - 2023-06-01T03:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising