స్వగ్రామానికి చేరిన తేజస్వినీరెడ్డి భౌతికకాయం
ABN, First Publish Date - 2023-06-26T02:55:51+05:30
ఎంఎస్ చేయడానికి వెళ్లి లండన్‌లో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం
హయత్‌నగర్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఎంఎస్ చేయడానికి వెళ్లి లండన్‌లో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం తేజస్వినీరెడ్డి(27) భౌతికకాయం ఆదివారం ఉదయం ఆమె స్వగ్రామం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లికి చేరుకుంది. 12 రోజులుగా భౌతికకాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబ సభ్యులు తేజస్వినీరెడ్డి మృతదేహాన్ని చూడగానే కుప్పకూలిపోయారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేష్ తదితరులు తేజస్వినీరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Updated Date - 2023-06-26T02:55:51+05:30 IST