ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైరి నరేష్‌ భార్య పిటిషన్‌పై హైకోర్టు చెప్పిన విషయం ఇదే

ABN, First Publish Date - 2023-01-24T19:40:10+05:30

బైరి నరేష్‌ (Bairi Naresh) భార్య పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బైరి నరేష్‌ (Bairi Naresh) భార్య పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. చర్లపల్లి జైలులోని సింగిల్‌ సెల్‌లో ఉంచి అధికారులు వేధిస్తున్నారని పిటిషన్‌ దాఖలు చేశారు. శిక్ష ఖరారైన ఖైదీలను సింగిల్‌ సెల్‌లో ఉంచుతారని నరేష్‌ న్యాయవాది పేర్కొన్నారు. జైలు అధికారులపై ఆరోపణలు అవాస్తవమని జీపీ పేర్కొంది. నరేష్‌ను అండర్‌ ట్రైల్‌ ఖైదీలను ఉంచే బరాక్‌లోనే ఉంచామని జీపీ తెలిపారు. బైరి నరేష్‌ ఉంటున్న సెల్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 31కి కోర్టు వాయిదా వేసింది.

గతేడాది నవంబర్ 19న వికారాబాద్‌ జిల్లా (Vikarabad District) కొడంగల్‌ మండలం రావుల్‌పల్లి గ్రామంలో అంబేడ్కర్‌ జాతర, విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై.. శివకేశవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొడంగల్‌ పోలీసులు బైరి నరేష్‌తో పాటు.. అంబేడ్కర్‌ జాతర కార్యక్రమ నిర్వాహకుడు డోలు హన్మంతును కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 153(ఏ), 295(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట, కరీంగనగర్‌ జిల్లా జమ్మికుంట ఠాణాల్లోనూ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2023-01-24T19:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising