ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంబరాలు చేయండి

ABN, First Publish Date - 2023-08-02T04:05:59+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని అద్భుత ప్రజా అనుకూలమైన, ఉద్యోగులకు పట్ల ఔదార్యంతో కూడిన నిర్ణయాలను తీసుకున్నదని, వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ఆర్టీసీ డీపోల ఎదుట కార్మికులతో వేడుకలు

బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని అద్భుత ప్రజా అనుకూలమైన, ఉద్యోగులకు పట్ల ఔదార్యంతో కూడిన నిర్ణయాలను తీసుకున్నదని, వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇటీవల 21 వేల మంది వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం, అనాఽథలందరినీ ఒక పాలసీ కిందకు తీసుకువచ్చి, వారి బాధ్యతను ప్రభుత్వమే చూసుకునేలా నిర్ణయం తీసుకోవడం అనేవి వారి పట్ల సర్కారుకు ఉన్న మానవీయతను చాటే నిర్ణయాలని పేర్కొన్నారు. వీటిపై జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఒకట్రెండు రోజుల్లో అటు వీఆర్‌ఏల కుటుంబాలతోను, ఆర్టీసీ కార్మికులతోను ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు సూచించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 70 కి.మీ మేర ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. విస్తరణ తర్వాత మెట్రో అందుబాటులోకి వచ్చే నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాలని సూచించారు.

Updated Date - 2023-08-02T04:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising