డాక్టర్ సైఫ్ సస్పెన్షన్ తాత్కాలిక రద్దు
ABN, First Publish Date - 2023-10-04T03:53:43+05:30
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల అనస్థీషియా పీజీ విద్యార్థి డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో ఆరోపణల ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సైఫ్‌ను తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.
తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశాలు
హనుమకొండ అర్బన్, అక్టోబరు 3: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల అనస్థీషియా పీజీ విద్యార్థి డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో ఆరోపణల ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సైఫ్‌ను తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. అతడి సస్పెన్షన్‌ను కోర్టు తాత్కాలికంగా రద్దు చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సైఫ్‌ను తరగతులకు అనుమతిస్తామని, శాఖాపరమైన విచారణను వారం రోజుల తర్వాత జరిపిస్తామని కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దా్‌స తెలిపారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 22న డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించి, చికిత్స పొందుతూ ఫిబ్రవరి 26న మృతి చెందింది. ప్రీతి మృతికి సైఫ్ కారణమనే అభియోగంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ సైఫ్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-10-04T03:53:43+05:30 IST