ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దతు తక్కువే

ABN, First Publish Date - 2023-06-11T00:42:24+05:30

కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలకు మద్ద తు ధర ప్రకటించింది. అయితే సాగు వ్య యం పెరిగినంతగా ప్రభుత్వ మద్దతు ధర పెరగలేదు. గత ఏడాదితో పోల్చితే మాత్రం మద్దతు ధర పెంపు శాతం పెరిగిందని వ్య వసాయ నిపుణులు చెబుతున్నారు. విత్త నం కొనుగోలు నుంచి పంట పండించి విక్రయించే వరకు రైతులు పలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరిగిన సాగు వ్యయం 8 17రకాల పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

వరికి రూ.143, పత్తికి రూ.540, నువ్వులకు రూ.805

మోత్కూరు: కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలకు మద్ద తు ధర ప్రకటించింది. అయితే సాగు వ్య యం పెరిగినంతగా ప్రభుత్వ మద్దతు ధర పెరగలేదు. గత ఏడాదితో పోల్చితే మాత్రం మద్దతు ధర పెంపు శాతం పెరిగిందని వ్య వసాయ నిపుణులు చెబుతున్నారు. విత్త నం కొనుగోలు నుంచి పంట పండించి విక్రయించే వరకు రైతులు పలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ఏటా సాగు వ్య యం పెరిగినా, ఏ పంట పండించినా గిట్టుబాటుకాక రైతులు నష్టపోతున్నారు. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం 2023-24 వ్యవసాయ సీజన్‌కు పంటల మద్దతు ధర ను ప్రకటించింది. అయితే పెరుగుతున్న సాగు వ్యయానికి అనుగుణంగా మద్దతు ధర లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, కేంద్ర ప్రభుత్వం వరి సన్న రకాలకు మాత్రం మద్దతు ధర ప్రకటించలేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి, పత్తి లక్షలాది ఎకరాల్లో సాగవుతోంది. కంది, వేరుశనగ, తదితర పంటలు వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. నువ్వు లు, పెసలు, పొద్దుతిరుగుడు, మినుములు లాంటి పంటలు నామమాత్రం గా సాగవుతాయి. యాదాద్రి జిల్లాలో గతఏడాది వానకాలం సీజన్‌లో 3.19 లక్షలఎకరాల్లో వరి, 1,11,380 ఎకరాల్లో పత్తి, 8,661 ఎకరాల్లో కంది సాగైం ది. నూనె గింజలు కేవలం 92ఎకరాల్లో సాగయ్యాయి. కేంద్ర ప్రభుత్వం లక్ష ల ఎకరాల్లో సాగు చేసే వరికి క్వింటాకు కేవలం రూ.143, పత్తికి క్వింటాకు రూ.540 ధర పెంచింది. తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే నువ్వులకు అత్యధికంగా క్వింటాకు రూ.805, ఆ తర్వాత పెసరకు రూ.803 ధర పెంచింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నువ్వులు, పెసర తదితర పంటలు నామమాత్రంగానే సాగవుతాయి. ఎక్కువగా సాగు చేసే పంటలకు ధర తక్కువగా పెంచి, నామమాత్రంగా సాగయ్యే పంటలకు ఎక్కువ ధర పెంచడం వల్ల రైతులకు పెద్దగా లాభం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పెరిగిన సాగు వ్యయం

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సాగు వ్యయం బాగా పెరిగింది. పత్తి విత్తనాల ప్యాకెట్‌పై రూ.43 అదనంగా ధర పెరిగింది. ట్రాక్టర్‌ దున్నకం, ఫ్లౌచేయడం వంటి వాటికి రేటు పెరిగింది.కూలీలకు ఇచ్చే రేట్లు కూడా పె రిగాయి.ఇటీవల ఓరైతు కత్తెర నాటు వేస్తే ఎకరాకు నాటు కూలి రూ.8,000 అయింది. వ్యవసాయ పంపుసెట్లు, ట్రాక్టర్‌ లాంటి యంత్రాల ధర సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇలా సాగు ఖర్చు పెరగడంతో కేంద్రప్రభు త్వం పెంచిన మద్దతు ధరలతో కొంత ఉపశమనం కలుగుతున్నా, లాభాల బాటలో నడవలేకపోతున్నామంటున్నారు. గత ఏడాది పత్తి క్వింటా సుమా రు రూ.8,000 విక్రయించినా గిట్టుబాటు కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం రూ. 640 పెంచి క్వింటా (పొడవు పింజకు) రూ.7,020 మద్దతు ధర ప్రకటిస్తే పెట్టుబడులు ఎలా చేతికొస్తాయని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.

సాగు ఖర్చు తక్కువగా చూపుతున్న ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ఏటా పంటల మద్దతు ధరలు పెంచుతున్నా సాగు ఖర్చు అంతకంటే ఎక్కువ పెరగడంతో లాభసాటి ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు. పంట సాగుకయ్యే వ్యయానికి 50శాతం అదనంగా కలిపి మద్దతు ధర ప్రకటించాలని గతంలో స్వామినాథన్‌ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సాగుకు అయ్యే వాస్తవ ఖర్చును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా వ్యయాన్ని తక్కువగా చూపుతూ 50శాతం కలిపి మద్దతు ధర ప్రకటిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

వరి, పత్తికి మద్దతు ధర పెంచాలి : బద్దం స్వామిరెడ్డి, రైతు, మోత్కూరు

కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధర కొంత పెంచినా గిట్టుబాటు కాదు. ఏటా సాగు ఖర్చు పెరుగుతున్న తీరున ప్రభుత్వం మద్దతు ధర పెంచడం లేదు. వరి క్వింటా రూ.2, 500, పత్తికి రూ.8,000 మద్దతు ధరగా నిర్ణయించాలి. అప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుంది. పంటల మద్దతు ధర ప్రకటించే ముందు ప్రభుత్వాలు నేరుగా రైతులతో గానీ, రైతు సంఘాల ప్రతినిధులతోగానీ చర్చించాలి.

పంటల మద్దతు ధర పెంపు ఇలా...

పంటరకం 2021 2022 పెంపు 2023 పెంపు

వరి (సాధారణం) 1,940 2,040 100 2,183 143

వరి (ఏ-గ్రేడ్‌) 1,960 2,060 100 2,203 143

పత్తి (మధ్యస్థ పింజ) 5,726 6,080 354 6,620 540

పత్తి (పొడవు పింజ) 6,025 6,380 355 7,020 640

కంది 6,300 6,600 300 7,000 400

పెసర 7,275 7,755 480 8,558 803

మినుములు 6,300 6,600 300 6,950 350

జొన్న (హైబ్రిడ్‌) 2,738 2,970 232 3,180 210

జొన్న (మాల్దండి) 2,758 2,990 232 3,225 235

సజ్జ 2,250 2,350 100 2,500 150

రాగులు 3,377 3,578 201 3,846 268

మొక్కజొన్న 1,870 1,962 92 2,090 128

వేరుశనగ 5,550 5,850 300 6,377 527

పొద్దుతిరుగుడు 6,015 6,400 385 6,760 360

సోయాబిన్‌ 3,950 4,300 350 4,600 300

నువ్వులు 7,307 7,830 523 8,635 805

నల్లనవ్వులు 6,930 7,287 357 7,734 447

Updated Date - 2023-06-11T00:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising