విమలక్కకు ‘సుద్దాల’ జాతీయ పురస్కారం
ABN, First Publish Date - 2023-10-08T04:43:30+05:30
సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఈనెల 13న సుందరయ్యవిజ్ఞాన
రాంనగర్, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఈనెల 13న సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. శనివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో కార్యక్రమానికి సంబంఽధించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జాతీయ పురస్కారాన్ని అరుణోదయ విమలక్కకు అందజేస్తున్నామని తెలిపారు.
Updated Date - 2023-10-08T04:43:30+05:30 IST