ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జావేద్‌ అక్తర్‌కు సినారె అవార్డు ప్రదానం

ABN, First Publish Date - 2023-07-30T03:16:22+05:30

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, సమాజం మరింత మానవీయం చెందేందుకు కవిత్వం ప్రధాన ప్రేరకంగా నిలుస్తుందని ప్రఖ్యాత కవి, హిందీ సినీ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ అన్నారు.

హైదరాబాద్‌ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, సమాజం మరింత మానవీయం చెందేందుకు కవిత్వం ప్రధాన ప్రేరకంగా నిలుస్తుందని ప్రఖ్యాత కవి, హిందీ సినీ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ అన్నారు. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతి వేదికగా జావేద్‌ అక్తర్‌కు విశ్వంభర-సినారె జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శాలువా, జ్ఞాపికతో పాటు రూ.ఐదు లక్షల నగదు పురస్కారాన్ని సినారె కుటుంబసభ్యులు అందజేశారు. అనంతరం జావేద్‌ అక్తర్‌ మాట్లాడుతూ భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశంలో ఒక ప్రాంత సాహిత్యాన్ని మరో ప్రాంతీయులు తెలుసుకోడానికి అనువాదాలు గవాక్షంలా పనిచేస్తాయని అన్నారు. ప్రముఖ రచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ దీపక్‌ మహాన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితానికే పరిమితం కావాల్సిన మతాన్ని ఓ సంక్లిష్ట సమస్యగా మార్చి జన బాహుళ్యం ముందు పెట్టడాన్ని పౌర సమాజం నిరసించాలని కోరారు.

Updated Date - 2023-07-30T03:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising