రెండో ఏఎనఎంలను రెగ్యులర్ చేయాలి
ABN, First Publish Date - 2023-08-22T01:21:36+05:30
రాష్ట్రంలో ప నిచేస్తున్న రెండో ఏఎనఎంలను రెగ్యులర్ చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి స త్యం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట రెం డవ ఏఎనఎంలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరుకుంది.
రెండో ఏఎనఎంలను రెగ్యులర్ చేయాలి
నల్లగొండటౌన, ఆ గస్టు 21: రాష్ట్రంలో ప నిచేస్తున్న రెండో ఏఎనఎంలను రెగ్యులర్ చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి స త్యం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట రెం డవ ఏఎనఎంలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండో ఏఎనఎంలను న్యాయబద్ధంగా ఆలోచించి పర్మినెంట్ చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తు న్నా నేటికి రెగ్యులర్ చేయకపోవడం విచారకరమన్నారు. రెండో ఏఎనఎంల బా ధలు సీఎం కేసీఆర్ అర్థం చేసుకొని వెంటనే వారిని పర్మినెంట్ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే వారికి వచ్చే జీతం ఏ మాత్రం సరిపోవటం లేదన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 4 వేల మందిని పర్మినెంట్ చేయకుండా మళ్లీ కొత్తగా నోటిఫికేషన వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 50 ఏళ్ల వయస్సులో పోటీ పడి పరీక్షలు ఎలా రాస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న రెండో ఏఎనఎంలను తక్షణమే రెగ్యులర్ చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, డివిజన కార్యదర్శి వి.లెనిన, ఏఎనఎంల సంఘం నాయకులు రత్నకుమారి, కార్యదర్శి నర్సమ్మ, బి.నాగమణి, వసంత, సుశీల, గీతారాణి, భూదేవి, లత, సైదమ్మ, రేణుక, సరిత, గాయత్రి, సత్తమ్మ, విజయసుధ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T01:21:36+05:30 IST