ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలి

ABN, First Publish Date - 2023-02-02T23:44:18+05:30

యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మ ర్పల్లి మండల కేం ద్రంలో 15 రోజులుగా కొనసాగిన పీఎంఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్పల్లి/తాండూరు/, ఫిబ్రవరి 2: యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మ ర్పల్లి మండల కేం ద్రంలో 15 రోజులుగా కొనసాగిన పీఎంఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక నుంచి అవుట్‌ డోర్‌, ఇండోర్‌ క్రీడలు నిర్వహించేందుకు ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. ఈమేరకు జడ్పీటీసీ మధుకర్‌ను ఆయన అభినందించారు. విజేతగా నిలిచిన వెంకటాపూర్‌ క్రికెట్‌ జట్టుకు రూ.50 వేల నగదు, షీల్డు, రెండో బహుమతి పొందిన మర్పల్లి మిత్ర లెవన్‌ జట్టుకు రూ.21వేల నగదు, షీల్డు అందజేశారు. వైస్‌ఎంపీపీ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీటీసీలు మల్లేశ్‌, బిచ్చన్న, నాయకులు ప్రభాకర్‌గుప్త, శ్రీకాంత్‌రెడ్డి, గఫార్‌, పవన్‌, రాచన్న, గోపాల్‌రెడ్డి, మధు, పాల్గొన్నారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ సమీపంలో జరుగుతున్న కేసీఆర్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ను రెండో రోజు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న ప్రారంభించారు. తాండూరు మున్సిఫ్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు డి.నర్సింగ్‌రావు, గురురాజ్‌, యువసేనా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, క్రీడలతో యువతరం మధ్య స్నేహభావాలు పెంపొందుతాయని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మర్పల్లి మండల పరిధిలోని కొంషెడ్‌పల్లిలో గడ్డం శైలజ స్మారకార్థం రెండు రోజులుగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 20 జట్లు తలపడ్డాయి. విజేతగా కొండాపూర్‌ జట్టు గెలుపొందగా రూ.33,330 నగదు, షీల్డ్‌ అందజేశారు. రెండో బహుమతి కొంషెడ్‌పల్లి గ్రామ జట్టు గెలుపొందగా రూ.16,660 నగదు, షీల్డ్‌ అందజేశారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రఫియొద్దీన్‌, నాయకులు రఘుపతిరెడ్డి, నర్సింహారెడ్డి, సాయిబా బా, నిర్వాహకులు శేఖర్‌, సర్వేశ్‌, టి.శ్రీనివాస్‌, బి.సతీ్‌షకుమార్‌, టి.రాము, టి.నవీన్‌, సంతో్‌షకుమార్‌, గోపికిషన్‌, నర్సింహులు, డి.సుమన్‌, ఎల్‌.దుర్గాప్రసాద్‌, బి.నరేష్‌, ప్రశాంత్‌, మహేందర్‌, శివప్రసాద్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T23:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising