ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యాచారం ప్రగతి కోసం ప్రత్యేక చొరవ

ABN, First Publish Date - 2023-10-17T00:17:42+05:30

తమకు ఇతర పార్టీల మేనిఫెస్టోలను కాపీకొట్టాల్సిన దుర్గతి పట్టలేదని, కేసీఆర్‌ విడుదల చేసిన మేనిఫెస్టో విపక్షాల కాపీ అని విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనం అని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

యాచారం, అక్టోబరు 16: తమకు ఇతర పార్టీల మేనిఫెస్టోలను కాపీకొట్టాల్సిన దుర్గతి పట్టలేదని, కేసీఆర్‌ విడుదల చేసిన మేనిఫెస్టో విపక్షాల కాపీ అని విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనం అని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. యాచారం మండలం అంటే తనకు ఎనలేని అభిమానమని, మండలానికి భారీగా నిధులు కేటాయించామన్నారు. సోమవారం యాచారంలో జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పింఛన్ల పెంపు, బీమా, సౌభాగ్యలక్ష్మి కింద పేద మహిళలకు నెలకు రూ.3వేలు వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పేదలకు గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే ఇస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఏం సాయమూ చేయడం లేదని నాయకులు క్యామ మల్లేష్‌ అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మండల అద్యక్షకార్యదర్శులు కె.రమే్‌షగౌడ్‌, పి.బాషా, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి,సొసైటీ చైర్మన్‌ వైస్‌ చైర్మన్‌లు రాజేందర్‌రెడ్డి, యాదయ్యలతో పాటు వివిద గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు.

Updated Date - 2023-10-17T00:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising