ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రామాల అభివృద్ధికి కృషి: మంత్రి మల్లారెడ్డి

ABN, First Publish Date - 2023-08-02T00:30:13+05:30

గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి అన్నారు. మండలంలోని గోధుమకుంట గ్రామంలో మంగళవారం పర్యటించిన మంత్రి మల్లారెడ్డి పలు కాలనీవాసులతో కలియతిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

గ్రామస్తులకు చెక్కును అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

కీసర, ఆగస్టు 1: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి అన్నారు. మండలంలోని గోధుమకుంట గ్రామంలో మంగళవారం పర్యటించిన మంత్రి మల్లారెడ్డి పలు కాలనీవాసులతో కలియతిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీఎస్‌ కాలనీలోని సీసీరోడ్డు పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తానని తెలిపారు. మండల పరిధిలోని చీర్యాల్‌ గ్రామంలో నిర్మించే ఆలయాలకు మంత్రి మల్లారెడ్డి తన సొంత నిధులు మంగళవారం మంజూరు చేశారు. చీర్యాల్‌లో శ్రీ మల్లిఖార్జున స్వామి, శ్రీ బీరప్ప దేవాలయం అభివృద్ధికి రూ.10లక్షలు అందజేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం మంత్రి మల్లారెడ్డి నివాసంలో చీర్యాల్‌ గ్రామస్థులకు రూ.4లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ పూస వెంకటేష్‌, ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, సర్పంచ్‌లు తుంగ ధర్మేంధర్‌, ఉపసర్పంచ్‌ సోమని ఆంజనేయులు, ఎంపీటీసీ కిరణ్‌జ్యోతి ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising