అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN, First Publish Date - 2023-09-23T00:20:52+05:30
అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్ర సమీపంలోని గొర్లకుంట తండా ఇండో అమెరికన్ సీడ్స్‌ల్యాండ్ కంపెనీ వద్ద చోటుచేసుకుంది.
కడ్తాల్, సెప్టెంబరు 22 : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్ర సమీపంలోని గొర్లకుంట తండా ఇండో అమెరికన్ సీడ్స్‌ల్యాండ్ కంపెనీ వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్ కథనం ప్రకారం.. దాసర్లపల్లికి చెందిన ఉప్పల లక్ష్మమ్మ(50) రోజూ మాదిరిగా గొరల్లకుంట తండా సమీపంలోని ఇండో అమెరికన్ సీడ్స్‌ల్యాండ్ కంపనీలో కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కిందపడిపోగా కంపెనీ సూపర్‌వైజర్ చికిత్స నిమిత్తం వెంటనే తుక్కుగుడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడినుంచి శంషాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలసుకున్న మృతరాలు లక్ష్మమ్మ బంధువులు ఆసుపత్రికి వెళ్ళి మృతదేహాన్ని చూసిన అనంతరం మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు లక్ష్మమ్మ భర్త భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్ తెలిపారు.
Updated Date - 2023-09-23T00:20:52+05:30 IST