ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హస్తం అందిపుచ్చుకునేనా?

ABN, First Publish Date - 2023-06-26T23:01:02+05:30

గత ఎన్నికల్లో పూర్తిగా డీలాపడిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నా వీటన్నింటినీ అందిపుచ్చుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమవు తోంది. నిన్నమొన్నటి వరకు బీజేపీ వైపు చూసిన కొందరు ఇప్పుడు కాంగ్రె్‌సవైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే కాలంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ చేరికలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అయితే ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునే విషయంలో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకునే నేతలు కాంగ్రెస్‌ పార్టీలో కనిపించడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు

కర్ణాటక ఫలితాల తరువాత మారుతున్న సమీకరణలు

పార్టీని వీడిన వారు వెనక్కివచ్చేందుకు ఆసక్తి

బీఆర్‌ఎస్‌, బీజేపీ అసంతృప్త నేతలు కాంగ్రెస్‌ వైపు చూపు

చేరికలకు సమన్వయం చేసే నాఽథులేరీ?

గత ఎన్నికల్లో పూర్తిగా డీలాపడిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నా వీటన్నింటినీ అందిపుచ్చుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమవు తోంది. నిన్నమొన్నటి వరకు బీజేపీ వైపు చూసిన కొందరు ఇప్పుడు కాంగ్రె్‌సవైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే కాలంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ చేరికలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అయితే ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునే విషయంలో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకునే నేతలు కాంగ్రెస్‌ పార్టీలో కనిపించడం లేదు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో కూడా కాంగ్రె్‌సకు ఆశాజనక పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్‌ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుత ఆశాజనక పరిస్థితులను కాంగ్రెస్‌ నాయకత్వం తనకు అనుకూలంగా ఎంత వరకు మలుచుకుంటుందనేది తెలియడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునే విషయంలో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకునే నేతలు కనిపించడం లేదు. వాస్తవానికి వరుసగా రెండు సార్లు పగ్గాలు చేపట్టిన బీఆర్‌ఎస్‌ పట్ల సాధారణంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇందులో ఎక్కువగా స్థానిక ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమయంలో నిన్నమొన్నటి వరకు అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ముందంజలో ఉన్న బీజేపీ కొద్ది రోజులుగా అధికార బీఆర్‌ఎస్‌ పట్ల కొంత దూకుడు తగ్గించినట్లు కనిపిస్తోంది. మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ పట్ల మొతక వైఖరి కనపరుస్తూ కాంగ్రె్‌సపై దాడిని పెంచింది. కొద్ది రోజులుగా రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తున్న వారు సైతం ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కేడర్‌లో కూడా ఇలాంటి అనుమానాలే నెలకొన్నాయి. దీంతో బీజేపీ నేతలు కూడా ఈ ఇరకాట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌ పట్ల తమ పార్టీ వైఖరి విషయంలో ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయని ఇటీవలే కొందరు పార్టీ నేతల బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మరికొందరు నేతలు ఇటీవల చేసిన బహిరంగ వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితుల తరువాత బీజేపీలోకి వెళ్లే విషయంలో కొందరు పునరాలోచనలో పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ చేరికలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అధికార బీఆర్‌ఎ్‌సలో ఉక్కబోతకు గురవుతున్న కొందరు సీనియర్లు ఇప్పటికే పక్కచూపులు చూస్తున్నారు. నిన్నమొన్నటి వరకు బీజేపీ వైపు చూసిన కొందరు ఇప్పుడు కాంగ్రె్‌సవైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నాళ్ల పాటు కాంగ్రె్‌సకు దూరంగా ఉన్న నేతలు కూడా కాంగ్రె్‌సలో క్రియాశీలకంగా ఉండేయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రె్‌సకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటికి కాంగ్రెస్‌ పెద్దలు వెళ్లి నచ్చచెప్పడంతో ఆయన తిరిగి పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. అలాగే కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఇంటికి పీసీసీ అఽధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. కొడంగల్‌ సీటును గురునాథ్‌రెడ్డికి ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోనున్నారు.

భారీగా వలసలు!

అలాగే అధికార పార్టీ నుంచి భారీగానే త్వరలో వలసలు వచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎ్‌సకు చెందిన బడా నేత తన అనుచరులతో కలిసి కాంగ్రె్‌సలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి భారీగానే కాంగ్రె్‌సలో చేరికలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ విషయం తెలిసి ఇటీవలే ఆయన్ని ప్రగతి భవన్‌కు పిలిపించి బుజ్జగించారు. టిక్కెట్‌ నీకే ఇస్తాం... మంత్రి పదవి ఇస్తామంటూ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినా ఆయన ఇంకా పార్టీ పెద్దలను నమ్మడం లేదు. ఎన్నికల వరకు ఇలానే మభ్యపెట్టి చివరకు చేయి ఇస్తారేమోనని అనుమానపడుతున్న ఆయన పార్టీ ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. తనకే టిక్కెట్‌ ఇస్తున్నట్లు ప్రెస్‌మీట్‌లో చెప్పాలని అప్పుడే తాను నమ్ముతానని చెప్పినట్లు తెలిసింది. దీన్ని బట్టి ఆయన బీఆర్‌ఎ్‌సలో ఉండే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

సమన్వయం చేసే వారేరీ?

కాంగ్రె్‌సకు ప్రస్తుతం ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నా వీటన్నింటినీ అందిపుచ్చుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమవుతోంది. కాంగ్రెస్‌ వైపు చూస్తున్న ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరపడంతో పాటు వారిని పార్టీపెద్దల వద్దకు తీసుకువెళ్లి టిక్కెట్‌ లేదా పార్టీ పదవులకు సంబంధించిన హామీలు ఇచ్చే వ్యవస్థను పార్టీ ఇంత వరకు ఏర్పాటు చేసుకోలేదు. ఇటీవల బీజేపీ చేరికల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి కమిటీ ఏదీ కాంగ్రె్‌సలో లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఒకరిద్దరు నేతలు మాత్రమే ఈ వ్యవహారాలు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని సమన్వయం చేసుకునే నేతలు లేకపోవడం కాంగ్రెస్‌ ఎదుగుదలకు ఆటంకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరు. బలంగా ఉన్న వారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించడం లేదని పార్టీలో అంతర్గత చర్చజరుగుతోంది. ఉదాహరణకు పార్టీ అధినాయకత్వం కోరిక మేరకు పార్టీలో తిరిగి చేరడమే కాక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎల్లాఆర్‌కు ఇంత వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో మీరు ఎక్కడ కోరినా టిక్కెట్‌ ఇస్తామని ఆయనకు కాంగ్రెస్‌ అగ్రనేతలు హామీ ఇచ్చారు. పార్టీలో కీలకంగా పనిచేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో కొంత పట్టుఉండడంతో పాటు ఆర్ధికంగా బలంగా ఉన్న ఆయన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే కాంగ్రె్‌సకు కొంత ప్రయోజనం ఉంటుంది. అలానే నియోజకవర్గస్థాయిలో పార్టీని నడపగలిగే బలమైన నేతలు కొన్ని చోట్ల ఉన్నారు. కానీ వీరికి సరైన మార్గనిర్ధేశం చేసే నాయకత్వం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదు.

హస్తం గూటికి గురునాథ్‌రెడ్డి!

వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత గురునాథ్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరడం ఖాయమైంది. కొంత కాలంగా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గురునాథ్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇది వరకు రెండు పర్యాయాలు స్వయంగా కలిసి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో జరిగిన పొంగులేటి, జూపల్లి వర్గీయుల భేటీలో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు, కొడంగల్‌ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌ పాల్గొన్నారు. సముచితమైన గౌరవం కల్పిస్తామని స్పష్టమైన హామీ లభించడంతో గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. వచ్చే నెల14 లేదా 16వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి తన కుమారులు, ముఖ్య అనుచరులతో కాంగ్రె్‌సలో చేరనున్నట్లు చెబుతున్నారు. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గురునాథ్‌రెడ్డికి నియోజక వర్గంలో గట్టిపట్టు ఉంది. తిరుగులేని నేతగా పేరున్న ఆయనకు సొంతంగా 20 నుంచి 30 వేల వరకు ఓటు బ్యాంకు ఉందనేది ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పేమాట. ఆ ఓటర్లలో చాలా వరకు గురునాథ్‌రెడ్డి ఎవరికి చెబితే వారికి ఓటేస్తారు. బీఆర్‌ఎ్‌సలో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న గురునాథ్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈఏడాది ప్రారంభంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీకి ఆహ్వానించారు. గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరతారంటూ అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన కుమారులు ఇద్దరూ కీలక ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. జగదీశ్వర్‌రెడ్డి కొడంగల్‌ మునిసిపల్‌ చైర్మన్‌గా, ముద్దప్ప దేశ్‌ముఖ్‌ కొడంగల్‌ ఎంపీపీగా బాధ్యతల్లో ఉన్నారు. కీలక పదవుల్లో కొనసాగుతున్న గురునాథ్‌రెడ్డి కుమారులు ఇద్దరూ తమ తండ్రి బాటలోనే హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న గురునాథ్‌రెడ్డి

తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కొంత కాలంగా గురునాథ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను పార్టీలో చేర్చుకునే సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీని అధిష్ఠానం నెరవేర్చలేదని, సీనియర్‌ మాజీ ఎమ్మెల్యే హోదాలో మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఆశించిన ఆయనకు అక్కడా భంగపాటే ఎదురైంది. మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఆశించి హస్నాబాద్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఆయనకు పార్టీ పరంగా మద్దతు లభించలేదు. గురునాథ్‌రెడ్డి అభ్యర్థనను పార్టీ కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మధ్య దూరం పెరిగింది. చాలా వరకు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో గురునాథ్‌రెడ్డి అసంతృప్తిని గుర్తించిన రేవంత్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డిని స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకున్న తరువాత తమ ఉమ్మడి జిల్లాకే చెందిన కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాఽథ్‌రెడ్డిని కూడా కాంగ్రె్‌సలో చేరాలంటూ ఆయన కూడా ఆహ్వానించారు. జూపల్లి కృష్ణారావు కాంగ్రె్‌సలో చేరే సమయంలో నిర్వహించే బహిరంగ సభలోనే గురునాథ్‌రెడ్డితో పాటు ఆయన కుమారులు తమ సన్నిహితులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరతార ని తెలిసింది.

అదే బాటలో కప్పాటి పాండురంగారెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి

రంగారెడ్డి అర్బన్‌ : రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలో అసంతృప్తి నేతలంతా ఒక్కొక్కరిగా అధికార పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మహేశ్వరం మాజీ ఇన్‌చార్జి, కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే కొత్త మనోహర్‌రెడ్డి వారి అనుచరులు కాంగ్రెస్‌ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉద్యమ సమయం నుంచి పనిచేసిన కప్పాటి పాండురంగారెడ్డితో పాటు మరి కొందరు కాంగ్రె్‌సలో చేరెందుకు సిద్ధమయ్యారు. కాగా సోమవారం కప్పాటితో పాటు కొత్త మనోహర్‌రెడ్డి ఢిల్లీలో ఏఐిసీసీ కార్యాలయంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు వారి బృందం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు ఏఏసీసీ చీప్‌ ఖర్గేతో భేటి అయ్యింది. ఇప్పటికే పలువురు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలు, ఉద్యమకారులతో కలిసి కాంగ్రె్‌సలో చేరేందుకు కొత్త మనోహర్‌రెడ్డి, పాండురంగారెడ్డి ముహూర్తం ఫిక్స్‌ చేసుకోగా.. మరికొంతమందితో ఇంకా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢీల్లీ వెళ్లిన వారిలో ఉద్యమ కారులు బొల్లారం వెంకట్‌రెడ్డి, సంతోష్‌ ముదురాజ్‌ తదితరులున్నారు. కాగా మహేశ్వరం నుంచి అధికార పార్టీ నుంచి టికెట్‌ రాదని కన్ఫామ్‌ కావడంతో కాంగ్రె్‌సలో చేరి పోటీ చేయాలని మహేశ్వరం మాజీ ఇన్‌చార్జి, కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే కొత్త మనోహర్‌రెడ్డి మొదటి నుంచి పొంగులేటి బాటలో నడవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే నెలలో మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలుస్తోంది. బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాతతో పాటు ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రె్‌సలో చేరారు. ఏది ఏమైనా మంత్రి సబితా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలయ్యిందనే చెప్పవచ్చు.

Updated Date - 2023-06-26T23:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising