ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యేగా గెలిస్తే కోటాలగూడ సమస్యలు పరిష్కరిస్తా

ABN, First Publish Date - 2023-02-21T23:40:48+05:30

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుస్తే కోటాలగూడ గ్రామాన్ని అభివృద్ధి పరచి గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : మాజీ మంత్రి చంద్రశేఖర్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 21: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుస్తే కోటాలగూడ గ్రామాన్ని అభివృద్ధి పరచి గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్‌ మండలం కోటాలగూడలో శక్తి కేంద్రం అధ్యక్షుడు యాదయ్య అధ్యక్షతన ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చద్రశేఖర్‌ మాట్లాడుతూ.. తనను గెలిపించిన వెంటనే కోటాలగూడలో నెలకొన్న భూ సంబంధిత రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామగుట్టపై ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని, దాన్ని తిరిగి గ్రామస్తులకు అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌నాయకులు, ప్రభుత్వం భుములు లాక్కుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నార న్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని అన్నారు. నియోజకవర్గ పాలక్‌, సినీ నటి జీవితరాజశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలనను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని, అన్ని దేశాలూ భారతదేశం వైపు చూస్తు న్నాయన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ పుంజుకుందని, ఈ సారి బీఆర్‌ఎస్‌కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. నియోజవర్గంలో బీజేపీ గెలుపు కోసం తాను ప్రతీ గడపకు వచ్చి ప్రజ లతో మమేకం అవుతానని చెప్పారు. మోదీ సంక్షేమ పథకాలను ప్రజలకు అర్ధమయ్యేలా తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌, బీజేపీ నాయకుడు రాఘవన్‌నాయక్‌, నాయకులు అమరేందర్‌రెడ్డి, నవీన్‌, మధుసూదన్‌రెడ్డి, ప్యాట శంకర్‌, బూత్‌ అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising