ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీతోనే సంక్షేమ పాలన

ABN, First Publish Date - 2023-03-02T00:13:58+05:30

కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, బీజేపీతోనే సంక్షేమ పాలన అందుతుందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జంగారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

షాబాద్‌, మార్చి 1 : కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, బీజేపీతోనే సంక్షేమ పాలన అందుతుందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జంగారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని మాచన్‌పల్లి గ్రామంలో ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శక్తి కేంద్ర ఇన్‌చార్జి కూతురు మహేందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనపడిందని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలు కలిసినా బీజేపీని ఓడించలేవని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కిరణ్‌, నాయకులు గ్రామస్తులు ఉన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్‌

ఇబ్రహీంపట్నం : తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డిలు అన్నారు. ప్రజా గోస- బీజేపీ భరోసాలో భాగంగా మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం టౌన్‌ పాత బస్టాండులో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు. దేశ ప్రజలంతా మోదీ నాయకత్వంపై పూర్తి భరోసాతో ఉన్నారని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీ శక్తి కేంద్ర ఇన్‌చార్జి ముత్యాల భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, నాయిని సత్యనారాయణ, వెంకటే్‌షగౌడ్‌, జక్క రవీందర్‌రెడ్డి, కాళిదాసు, మున్సిపల్‌ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2023-03-02T00:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!