ఇబ్రహీంపట్నాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
ABN, First Publish Date - 2023-09-12T00:23:22+05:30
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అభివృద్ధిలో మోడల్ పురపాలక సంఘంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 11: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అభివృద్ధిలో మోడల్ పురపాలక సంఘంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం 11, 12, 13 వార్డుల్లో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. బృందావన్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.90లక్షలు మం జూరు చేశామని, త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. రెండుచోట్ల్ల కమ్యూనిటీ హాళ్లకు మొదట 10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వార్డులకు లింకుగా మార్కెట్ యార్డు నుంచి 40ఫీట్ల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు. పట్టణంలో కొత్తగా కాలనీలు విస్తరిస్తు న్నాయని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఆరు బయట చెత్త పారబోయొద్దని, చెత్త వాహనాల్లోనే వేయాలని సూచించారు. అన ంతరం కాలనీలో మొక్కలు నాటారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కె.రాములు, మున్సిపల్ వైస్‌చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు పద్మ, మోహన్‌నాయక్, బాల్‌రాజ్, మాజీ కౌన్సిలర్లు సురేష్, శంకర్, 11, 12వ వార్డుల బీఆర్‌ఎస్ అధ్యక్షులు రాందాస్, త్రిలోక్‌కుమార్, బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
యాచారం: రోడ్డు ప్రమాదంలో గాయపడి మూడు రోజులుగా బీఎన్ రెడ్డి నగర్‌లోని భృంగీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరక్టర్ తలారి మల్లేష్ కుమారు లు తలారి సాయి, సంపత్‌లను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, బీ ఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్ సోమవారం పరామర్శించారు. యువకు ల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల ను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అంది ంచాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. పరామర్శించి న వారిలో యాచారం మాజీ జెడ్పీటీసి రమే్‌షగౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు జెర్కోని రాజు తదితురులు ఉన్నారు.
Updated Date - 2023-09-12T00:23:22+05:30 IST