ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహన దొంగల అరెస్ట్‌

ABN, First Publish Date - 2023-02-21T00:36:35+05:30

నగర శివా రుల్లో వాహన చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు రికవరీ చేసిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ టౌన్‌, ఫిబ్రవరి 20: నగర శివా రుల్లో వాహన చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్‌ ఏసీసీ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గిరిగట్టుకు చెందిన షేక్‌ ఇసాక్‌(22) డ్రైవర్‌. వడ్ల రవికుమార్‌(19) సెంట్రిగ్‌ పని చేస్తాడు. మన్సూరాబాద్‌కు చెందిన బెల్లంకొండ శివనాగమల్లేశ్వర్‌(22) వంటపనిచేస్తాడు. వీరి పరిచయంతో ముఠాగా ఏర్పాడి కొద్ది రోజులుగా సైబరాబాద్‌, రాచకొండ పరిధితో పాటు, మెదక్‌, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోనూ బైక్‌లు, ఆటోలు, సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడ్డారు. బాలానగర్‌ సీసీఎస్‌ సిబ్బందితో కలిసి మేడ్చల్‌ పీఎస్‌ పరిధిలో సోమవారం ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి నుంచి రూ.11లక్షల20వేల విలువ చేసే మూడు ఆటోలు, ఆరు బైకులు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసు కున్నట్టు చెప్పారు. పార్క్‌ చేసిన వాహనాలను అపహరించే వారన్నారు. వీరు పాత నేరస్థులన్నారు. దొంగలను పట్టుకున్న మేడ్చల్‌ టీంను ఏసీపీ అభినందించారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising