ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2023-06-26T23:34:23+05:30

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని పరిగి మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌లు అన్నారు.

పరిగి: విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, యూనీఫాం, బ్యాగులు అందజేస్తున్న చైర్మన్‌ అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, జూన్‌ 26: విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని పరిగి మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌లు అన్నారు. పరిగిలోని బీసీ బాలికల వసతి గృహంలో సోమవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌, బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలికలు ప్రాథమిక దశ నుంచే ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. వసతి గృహంలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ జె.శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు బి.ప్రవీణ్‌రెడ్డి, వార్డెన్‌ బి.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

ఘట్‌కేసర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్ధుల అబివృద్దికోసం ప్రేమహస్తం పౌండేషన్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్‌ కొమ్మగోని రమాదేవి సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీనగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. ప్రేమహస్తం ఫౌండేషన్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీసర్పంచ్‌ స్టీవెన్‌, హెచ్‌ఎం శ్రీశైలం, విద్యార్థులు పాల్గొన్నారు.

కీసర: నాగారంలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీభవానినాగలింగేశ్వర స్వామి ఆలయ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి విచ్చేసి మాట్లాడారు. పేదలకు నోట్‌ పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బండారి మల్లే్‌షయాదవ్‌లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పాఠశాలలో పఠనోత్సవం

కులకచర్ల: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం పఠనోత్సవ కార్యక్రమాన్ని హెచ్‌ఎం వెంకటయ్య ప్రారంభించారు. జూలై 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. చిన్న కథల పుస్తకాలు అందించి చదివిస్తామన్నారు. ఈ సందర్భంగా సరస్వతిమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పూడూరు: మండలంలోని చన్‌గోముల్‌ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో హరిచందర్‌ సోమవారం సందర్శించారు. పాఠశాలలో ప్రార్థనలో పాల్గొని పఠనోత్సవంపై ఉపాధ్యాయులతో మాట్లాడారు. అదే విధంగా కేజీబీవీ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనంలో గుడ్లు ఇవ్వడం లేదని తెలుసుకొని ఎస్‌వోను మందలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-06-26T23:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising