ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌కు తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2023-03-02T00:11:28+05:30

ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. బుధవారం వ్యక్తిగత పని నిమిత్తం కీసరకు వచ్చి నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉప్పల్‌ ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • ఎదురుగా వెళ్తున్న కారును తప్పించబోయి ఎమ్మెల్యేకు స్వల్పగాయాలు

కీసర, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. బుధవారం వ్యక్తిగత పని నిమిత్తం కీసరకు వచ్చి నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కీసర ఔటర్‌రింగ్‌ రోడ్డు జంక్షన్‌ సమీపంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి వెళ్తున్న ఫార్చునర్‌ కారు ముందు వెళ్తున్న మరో కారు ఉంది. ఆ కారుకు కుక్క అడ్డు రావడంతో సడన్‌బ్రేక్‌ వేసి కుక్కను తప్పించబోయాడు. ఆ కారు వెనకాలే ఉన్న ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కారు డ్రైవర్‌ ముందు వెళ్తున్న కారును తప్పించబోయి సడన్‌గా బ్రేక్‌ వేశాడు. దీంతో ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కాలు కారు డాష్‌బోర్డుకు గట్టిగా తగలి ఎమ్మెల్యే మోకాలికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదంలో స్వల్పగాయాలతో భయటపడ్డానని, క్షేమంగానే ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. తన కార్యకర్తలకు, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని చెప్పి ఎమ్మెల్యే తన ఇంటికి బయలుదేరారు.

Updated Date - 2023-03-02T00:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!