ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయం

ABN, First Publish Date - 2023-02-21T23:50:23+05:30

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్యంతో ఆదివారం మృతిచెందగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని బీఎస్పీ మండల అధ్యక్షుడు మల్లన్న అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న బీఎస్పీ మండల అధ్యక్షుడు మల్లన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ, ఫిబ్రవరి 21: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్యంతో ఆదివారం మృతిచెందగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని బీఎస్పీ మండల అధ్యక్షుడు మల్లన్న అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సాయన్న దళితుడైనందువల్లే పాలకులు ఆయనను అవమానించారన్నారు. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్‌ దళిత ఎమ్మెల్యేలు గమనించాలని కోరారు. సిట్టిం గ్‌ ఎమ్మెల్యే సాయన్నను అవమానపర్చిన విధంగానే వారికీ ఇదే గతి పడుతుందన్నారు. దళితులకో న్యాయం, అగ్రవర్ణాలకు ఓ న్యాయమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రమేశ్‌, మల్లేశ్‌, మొగులప్ప, భీమేశ్‌, వెంకటయ్య, రాములు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising