అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్
ABN, First Publish Date - 2023-03-05T00:31:33+05:30
అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను కులకచర్ల పోలీసులు సీజ్‌చేసి డ్రైవర్‌లపై కేసు నమోదు చేశారు.
కులకచర్ల, మార్చి 4: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను కులకచర్ల పోలీసులు సీజ్‌చేసి డ్రైవర్‌లపై కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి పీఎస్ పరిధిలోని అనంతసాగర్ గ్రామ సమీపాన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అటుగా రెండు ఇసుక ట్రాక్టర్లు రాగా వాటిని ఆపి విచారించారు. ఇసుకను తరలించేందుకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో ట్రాక్టర్‌లను పీఎ్‌సకు తరలించారు. ట్రాక్టర్లను సీజ్ చేసి ట్రాక్టర్ డ్రైవర్‌లు మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన శాంతయ్య, రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు.
Updated Date - 2023-03-05T00:31:33+05:30 IST