వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
ABN, First Publish Date - 2023-08-02T00:22:07+05:30
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు. పోలీసుల కథన ప్రకారం.. శంషాబాద్ మండలం మధురానగర్ బస్తీలో నివాసముంటున్న డి.సుజాత కుమారుడు ప్రసాద్(19) ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు.
శంషాబాద్, ఆగస్టు 1 : వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు. పోలీసుల కథన ప్రకారం.. శంషాబాద్ మండలం మధురానగర్ బస్తీలో నివాసముంటున్న డి.సుజాత కుమారుడు ప్రసాద్(19) ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం గండిపేటలో పని ఉందని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి సుజాత గండిపేటకు వెళ్లి అతడు పనిచేసే చోట విచారణ చేసింది. కానీ, ఆచూకీ దొరకలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపో యింది. దీంతో మంగళవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఫౌండేషన్‌లో వంటమనిషిగా పనిచేసే బొక్క రత్నకుమార్ అదృశ్యమయ్యాడు. బంధువులు సోమవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీలోని పల్నాడు జిల్లా నగిరికల్ మండలం చల్లగుల్లకు చెందిన రత్నకుమార్(27) ఏడాదిన్నర క్రితం శంషాబాద్ జీఎంఆర్ ఫౌండేషన్‌లో వంట మనిషిగా పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. జూలై 15న బంధువులు ఫోన్ చేయగా గదిలోనే ఉన్నాను. డ్యూటీకి వెళ్లడం లేదని చెప్పాడు. 16వ తేదీన ఫోన్‌చేయగా మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బంధువులు జీఎంఆర్ ఫౌండేషన్ వద్దకు వెళ్లి విచారించగా అక్కడ కనిపించలేదు. జూలై 5వ తేదీన సాయంత్రం నెల జీతం తీసుకొని వెళ్లిపోయినట్లు యాజమాన్యం చెప్పింది. అనంతరం బంధువులు సొంతూరికి వెళ్లి పరిచయమున్న వారి వద్ద వెతికినా జాడ తెలియరాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2023-08-02T00:22:07+05:30 IST