ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తహసీల్దార్ల బదిలీలు

ABN, First Publish Date - 2023-08-02T00:13:00+05:30

సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో పని చేస్తున్న 14 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేయగా, జిల్లాకు కొత్తగా 17 మంది తహసీల్దార్లను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వికారాబాద్‌ జిల్లా నుంచి 14 మంది అధికారుల బదిలీ

ఇతర జిల్లాల నుంచి జిల్లాకు 17 మంది కేటాయింపు

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా నుంచి 8 మంది ట్రాన్స్‌ఫర్‌

వికారాబాద్‌/మేడ్చల్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో పని చేస్తున్న 14 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేయగా, జిల్లాకు కొత్తగా 17 మంది తహసీల్దార్లను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌.రవీందర్‌, గోవిందమ్మలు సంగారెడ్డి జిల్లాకు, అశ్వాక్‌ రసూల్‌, వాహీదాఖాటూన్‌, షాహీదాబేగంలను గద్వాల్‌ జిల్లాకు, జె.బుచ్చయ్య, ఎస్‌.అశోక్‌కుమార్‌, టి.భీమయ్యగౌడ్‌, బి.కృష్ణయ్యలను హైదరాబాద్‌ జిల్లాకు కేటాయించారు. ఎన్‌.విద్యాసాగర్‌రెడ్డి, పి.శ్రీనివా్‌సరెడ్డిలను మహబూబ్‌నగర్‌ జిల్లాకు, ఎం.శ్రీధర్‌ నల్లగొండ జిల్లాకు, చిన్నప్పలనాయుడు రంగారెడ్డి జిల్లాకు, సుధా లింగాలను మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, తహసీల్దార్‌ కృష్ణయ్యను హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాకు కేటాయించడం గమనార్హం. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు కేటాయించిన తహసీల్దార్లను మంగళవారం సాయంత్రం రిలీవ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే, జిల్లాకు ఇతర జిల్లాల నుంచి 14 మంది తహసీల్దార్లను కేటాయించారు. సంగారెడ్డి జిల్లా నుంచి ఆర్‌.మనోహర్‌ చక్రవర్తి, యు.రమాదేవి, కె.ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌.మురళీధర్‌, కె.కిషన్‌, బి.ప్రభు, బి.జయరాం, కేతావత్‌ తారాసింగ్‌, కె.పద్మావతి, బి.విజయకుమార్‌, సి.విజయకుమార్‌, పి.అశాజ్యోతిలను జిల్లాకు కేటాయించగా, జనగామ నుంచి వి.గంగాభవానీ, రంగారెడ్డి జిల్లా నుంచి కె.రాములు, మహబూబ్‌నగర్‌ నుంచి బి.లక్ష్మీనారాయణ, నారాయణపేట్‌ నుంచి వై.దానయ్య, యాదాద్రి నుంచి డి.గణే్‌షలను వికారాబాద్‌ జిల్లాకు కేటాయించారు. వివిధ జిల్లాల నుంచి జిల్లాకు కేటాయించిన తహసీల్దార్లు బుధవారం జిల్లాలో రిపోర్ట్‌ చేయనున్నట్లు తెలిసింది.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ..

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో తహసీల్దార్లు ఎం.మహిపాల్‌రెడి (ఉప్పల్‌) జనగాంకు, ఎం.సురేందర్‌, జి.గోవర్ధన్‌, గౌతంకుమార్‌లను రంగారెడ్డి జిల్లాకు, పి.సంజీవరావును సంగారెడ్డికి, ఎం.ఇస్తర్‌అనితను సంగారెడ్డికి, కె.నాగమణిని సంగారెడ్డికి, వై.గౌరీవత్సల(కీసర)ను సంగారెడ్డికి, ఎన్‌.ఆర్‌.సరిత(మేడ్చల్‌)ను సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మేడ్చల్‌ జిల్లాకు వివిధ జిల్లాల నుంచి తహసీల్దార్‌లు బి.శైలజ, హసీనా, ఎల్‌.పూల్‌సింగ్‌, పి.సైదులు, ఎం.కృష్ణారెడ్డి, టి.సుచరిత, ఎల్‌.రాంమోహన్‌, వై.ఎ్‌స.శ్రీనివాస్‌, యు.అశోక్‌కుమార్‌, జె.స్వామి, ఎన్‌.సుజాతలను జిల్లాకు కేటాయించారు.

Updated Date - 2023-08-02T00:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising