పేస్టు రూపంలో బంగారం తరలింపు
ABN, First Publish Date - 2023-04-03T23:42:59+05:30
బంగారాన్ని అక్రమంగా తరలించడానికి కొందరు చేస్తున్న ప్రయోగాలు విస్తుగొల్పుతున్నాయి. ఓ ప్రయాణికుడు ఏకంగా బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి పెద్దపేగులో దాచి మరి తరలిస్తూ పట్టుబడ్డాడు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన ప్రయాణికుడు
శంషాబాద్, ఏప్రిల్ 3 : బంగారాన్ని అక్రమంగా తరలించడానికి కొందరు చేస్తున్న ప్రయోగాలు విస్తుగొల్పుతున్నాయి. ఓ ప్రయాణికుడు ఏకంగా బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి పెద్దపేగులో దాచి మరి తరలిస్తూ పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం దుబాయ్ నుంచి వయా రియాద్ గుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అందులో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో స్కానింగ్ చేశారు. దీంతో ప్రయాణికుడి పెద్దపేగులో కోడిగుడ్డు ఆకారంలో బంగారం పేస్టురూపంలో ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు పెద్దపేగులో దాచిన బంగారాన్ని బయటకు తీశారు. దానిని తూకం వేయగా 210గ్రాములు ఉన్నట్లు తేలింది. బంగారం విలువ దాదాపు 13 లక్షల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-04-03T23:42:59+05:30 IST