కొత్త దుకాణాలకు వేళాయే!
ABN, First Publish Date - 2023-08-04T22:48:00+05:30
జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాదిడిసెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న 2023-25 సంవత్సరాలకు సంబంఽధించి జిల్లాలో 59 మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ శుక్రవారం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నవీన్‌చంద్ర నోటిఫికేషన్ విడుదల చేశారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు రూపంలో రూ. 2 లక్షలు డీడీ లేదా చలాన్ చెల్లించాల్సి ఉంటుంది.
మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
కొత్త మద్యం విధానం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి
దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు, ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే అవకాశం
ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు
21న కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో కలెక్టర్ సమక్షంలో లాటరీ
జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాదిడిసెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న 2023-25 సంవత్సరాలకు సంబంఽధించి జిల్లాలో 59 మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ శుక్రవారం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నవీన్‌చంద్ర నోటిఫికేషన్ విడుదల చేశారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు రూపంలో రూ. 2 లక్షలు డీడీ లేదా చలాన్ చెల్లించాల్సి ఉంటుంది.
వికారాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్ జిల్లాలో 59 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ దుకాణాల్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 9, గౌడ్‌లకు 6 దుకాణాలు రిజర్వు చేశారు. మిగతా 42 దుకాణాలను అన్ రిజర్వుడ్‌కు కేటాయించగా, వీటికి అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వికారాబాద్ మునిసిపల్ కార్యాలయం ఆవరణలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఆవరణలో ఈనెల 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 21న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి మద్యం దుకాణాలను ఖరారు చేసి అనుమతులు జారీ చేయనున్నారు. 5వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో వార్షిక ఎక్సైజ్ ఫీజుగా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 5,001 నుంచి 50 వేల మధ్య జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.55 లక్షలు, 50,001 నుంచి లక్ష మధ్య జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.60 లక్షలు ఎక్సైజ్ లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో రూ.50 లక్షల స్లాబ్ పరిధిలోకి 14 దుకాణాలు రాగా, రూ. 55 లక్షల స్లాబ్ పరిధిలో 28 దుకాణాలు, రూ.60 లక్షల స్లాబ్ పరిధిలోకి 17 దుకాణాలు ఉన్నాయి. లైసెన్సుదారులు వార్షిక ఎక్సైజ్ లైసెన్సు ఫీజును ప్రతి ఏడాదిలో ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం లైసెన్స్ ఫీజులో 25 శాతానికి బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది.
రిజర్వు చేసిన మద్యం దుకాణాలివే
ఎస్టీలకు పరిగి సర్కిల్ పరిధిలో రెండు మద్యం దుకాణాలు రిజర్వు చేశారు. ఎస్సీలకు తాండూరు సర్కిల్ పరిధిలో రెండు, వికారాబాద్ సర్కిల్ పరిధిలో రెండు, పరిగి సర్కిల్ పరిధిలో మూడు, కొడంగల్ సర్కిల్ పరిధిలో రెండు దుకాణాలు కేటాయించారు. గౌడ్‌లకు మోమిన్‌పేట సర్కిల్ పరిధిలో రెండు మద్యం దుకాణాలు రిజర్వు చేయగా, తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ సర్కిళ్ల పరిధిలో ఒక్కో మద్యం దుకాణం రిజర్వు చేశారు. రిజర్వు కేటగిరీలకు సంబంధించిన మద్యం దుకాణాలను గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎస్టీలకు మొత్తం రెండు మద్యం దుకాణాలు రిజర్వు చేయగా, పరిగి మునిసిపల్ పరిధిలో షాప్‌నెం.4 (గజిట్ నెం: వికెబి044), కులకచర్లలో షాప్‌నెం.1 (గజిట్ నెం: వికెబి047) కేటాయించారు.. ఎస్సీలకు తొమ్మిది మద్యం దుకాణాలు రిజర్వు చేయగా, తాండూరు సర్కిల్ పరిధిలో పెద్దేముల్ మండలం, తట్టేపల్లి (గజిట్ నెం: వికెబి012), యాలాల్ మండలం, బాగాయిపల్లి (గజిట్ నెం: వికెబి018), వికారాబాద్ సర్కిల్ పరిధిలో మునిసిపాలిటీలో షాప్‌నెం.2 (గజిట్ నెం: వికెబి020), నవాబ్‌పేట్ మండలం, మైతాబ్‌ఖాన్‌గూడ (గజిట్ నెం: వికెబి033), పరిగి సర్కిల్ పరిధిలో మునిసిపల్ ప్రాంతంలో షాప్‌నెం.3 (గజిట్ నెం: వికెబి042), షాప్‌నెం.6 (గజిట్ నెం: వికెబి045), షాప్‌నెం.7 (గజిట్‌నెం: వికెబి046), కొడంగల్ సర్కిల్ పరిధిలోమునిసిపాలిటీలో షాప్‌నెం.1 (గజిట్ నెం: వికెబి052), దౌల్తాబాద్ (గజిట్ నెం: వికెబి056) మద్యం దుకాణాలు కేటాయించారు. గౌడ్‌లకు తాండూరు మునిసిపాలిటీలో షాప్ నెం.6 (గజిట్ నెం: వికెబి006), వికారాబాద్ సర్కిల్ పరిధిలో ధారూరు షాప్‌నెం.2 (గజిట్ నెం:వికెబి028), మోమిన్‌పేట్ సర్కిల్ పరిధిలో మర్పల్లి షాప్‌నెం.1 (గజిట్ నెం:వికెబి034), మోమిన్‌పేట్ షాప్‌నెం.1 (గజిట్ నెం: వికెబి036), పరిగి సర్కిల్ పరిధిలో కులకచర్ల షాప్‌నెం.2 (గజిట్‌నెం: వికెబి048) రిజర్వు చేశారు. మిగతా 42 మద్యం దుకాణాలకు అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్ రిజర్వుడ్‌కు 42 మద్యం దుకాణాలు
తాండూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 18 మద్యం దుకాణాలు ఉండగా, వీటిలో మూడు దుకాణాలు ఎస్సీ, గౌడ్‌లకు రిజర్వు చేయగా, మిగిలిన 15 దుకాణాలు అన్ రిజర్వుడ్‌గా ప్రకటించారు. వికారాబాద్ సర్కిల్ పరిధిలో 15 మద్యం దుకాణాల్లో ఎస్సీ, గౌడ్‌లకు మూడు దుకాణాలు కేటాయించగా, మిగిలిన 12 మద్యం దుకాణాలు అన్ రిజర్వుడ్‌గా మిగిలాయి. మోమిన్‌పేట్ సర్కిల్ పరిధిలో 6 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనుండగా, వీటిలో గౌడ్‌లకు రెండు దుకాణాలు రిజర్వు చేయగా, మిగిలిన నాలుగు దుకాణాలు అన్ రిజర్వుడ్‌గా ఉంచారు. పరిగి సర్కిల్ పరిధిలో 12 మద్యం దుకాణాల్లో వాటిలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు ఆరు మద్యం దుకాణాలు రిజర్వు చేయగా, మిగిలిన ఆరు దుకాణాలు అన్‌రిజర్వుడ్‌గా మిగిలాయి. కొడంగల్ సర్కిల్ పరిధిలో 8 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో ఎస్సీ,. గౌడ్‌లకు మూడు మద్యం దుకాణాలు రిజర్వు చేయగా, మిగిలిన ఐదు దుకాణాలు అన్ రిజర్వుడ్‌కు కేటాయించారు.
ఒక్కరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు
ఒక్కరు ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా, ప్రతి దరఖాస్తుకు ఫీజు కింద రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించరు. దరఖాస్తుదారుల వయస్సు కనీసం 21వ సంవత్సరాలు నిండి ఉండాలి. ఇంతకు ముందు ఎక్సైజ్ కేసులు నమోదైనా, జైలు శిక్ష పొందిన వారు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. రిజర్వు కేటగిరిల్లో దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం జతపరచాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వు కేటగిరికి చెందిన వారైతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు పత్రం వెంట జతపరచాల్సి ఉంటుంది.
59 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ
వికారాబాద్ జిల్లాలో 59 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. డిసెంబరు ఒకటో తేదీ నుంచి రెండేళ్ల కాలపరిమితితో ఉండే మద్యం దుకాణాల లైసెన్సులు జారీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారు ఈనెల 18వ తేదీలోగా తమ దరఖాస్తులను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తుదారులు నిర్ణీత దరఖాస్తుతో పాటు రెండు లక్షల రూపాయల డీడీ లేదా చలాన్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, పాన్‌కార్డు కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి.. ఇతర వివరాలకు స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాల్లో సంప్రదించాలి.
- నవీన్‌చంద్ర, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, వికారాబాద్
Updated Date - 2023-08-04T22:48:00+05:30 IST