ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్న ముగ్గురి రిమాండ్‌

ABN, First Publish Date - 2023-06-26T23:32:25+05:30

సామాజిక మాధ్యమంలో కళాశాల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడటంతో పాటు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతున్న ముగ్గురిని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేసిసోమవారం రిమాండ్‌కు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 26: సామాజిక మాధ్యమంలో కళాశాల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడటంతో పాటు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతున్న ముగ్గురిని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేసిసోమవారం రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరే్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అవుషాపూర్‌ సమీపంలోని వీబీఐటీ కళాశాలకు చెందిన విద్యార్థినులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వేధింపుకాల్స్‌తో పాటు అసభ్యకర మేసేజ్‌లు వస్తున్నాయని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన ఘట్‌కేసర్‌ పోలీసులు ఏపీలోని గుంటూరు జిల్లా, వట్టిచెరుకు మండలం కర్రెపాడు గ్రామానికి చెందిన చోప్పారపు లక్షిగణేష్‌(20), తూర్పు గోదావరి జిల్లా, కాకినాడకు చెందిన కొత్తగిరి వీరబాబు(20), చిట్టిబోయిన ద్గురాజు(20)లను అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. ప్రధాన నిందితుడు లక్ష్మిగణేష్‌ గత ఐదు నెలల క్రితం ఇదే కళాశాలకు చెందిన విద్యార్థినులకు అసభ్యకర మెసెజ్‌లు పంపిన కేసులో రిమాండ్‌కు తరలించారు. బయటకు వచ్చిన నిందితుడు లక్ష్మిగణేష్‌ గూగుల్‌ యాప్‌ ద్వారా సేవ్‌ అయిన నెంబర్లతో తిరిగి విద్యార్థినులకు దుర్గరాజు, వీరబాబులతో కలిసి అసభ్యకర మేసేజ్‌లు పంపారు. నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను సోమవారం సాయంత్రం రిమాండ్‌ తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

Updated Date - 2023-06-26T23:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising