ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

ABN, First Publish Date - 2023-03-30T23:23:52+05:30

సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదని మర్పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ రామేశ్వర్‌ అన్నారు.

మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మర్పల్లి, మార్చి 30: సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదని మర్పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ రామేశ్వర్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంసీఎం ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు కొందరు కొన్ని రోజులుగా తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కొందరి మాటలు విని పార్టీలో వర్గవిభేదాలు చేస్తున్నారని, దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకే నష్టం వాటిల్లుతుందన్నారు. మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌గా తమకు నామినేట్‌ పదవులు ఇచ్చారే కానీ ఏనాడూ తాము ఎమ్మెల్యే వద్దకు వెళ్లి పదవులను ఆశించలేదన్నారు. ఎమ్మెల్యే చెబితే రాజీనామా చేసుందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తాము తెలంగాణ పోరాటం నుంచి పార్టీలో ఉంటూ తమ ఆస్తులను కోల్పోయామే తప్పా ఆస్తులను కూడగట్టుకోలేదన్నారు. త్వరలోనే అధిష్ఠానం నుంచి తమకు పిలుపు వస్తుందని, అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో, ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారో తాము సాక్ష్యాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాము బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటామని, పార్టీ ఎవరి సొత్తు కాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవి, సొసైటీ వైస్‌చైర్మన్‌ ఫసియోద్దీన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు శంకర్‌, వెంకట్‌రెడ్డి, సురేష్‌, యాదవరెడ్డి, శేఖర్‌, పాండు, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising