ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2023-06-07T23:53:06+05:30

రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీచైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, జూన్‌ 7 : రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని సర్దార్‌నగర్‌లో నాబార్డ్‌ సహకారంతో రూ.2.50 కోట్లతో నిర్మించిన కోల్డ్‌స్టోరేజీని డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి, ఎంపీపీ ప్రశాంతిమహేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ మల్లేష్‌లతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. జిల్లాలోనే అతిపెద్ద సంతగా పేరుగాంచిన సర్దార్‌నగర్‌లో కోల్డ్‌ స్టోరేజీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీఈవో శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ నర్సింగ్‌రావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివా్‌సగౌడ్‌, కోఆప్షన్‌మెంబర్‌ చాంద్‌పాషా, సర్పంచ్‌ స్వరూప, ఎంపీటీసీ వనిత, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, నర్సింహులు, వెంకటేష్‌, మల్లికార్జున్‌గౌడ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising