దివంగత వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
ABN, First Publish Date - 2023-09-02T23:46:05+05:30
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు.
డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
రంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 2 : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. వైఎస్సార్ 14వ వర్ధంతిని పురస్క రించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలకు బాటలు వేసిన నేత వైఎస్సార్ అన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, పావలా వడ్డీ వంటి పథకాలను అమలు చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటే్‌షగౌడ్, చల్లా బాల్‌రెడ్డి, శ్రీశైలం, శ్రీనివా్‌సరెడ్డి, యాదిరెడ్డి, భాస్కర్, యాదయ్య, సుభాష్‌రెడ్డి,సురేందర్‌రెడ్డి, మురళీగౌడ్, పరశురాం, చంద్రమోహన్, ఆనంద్, గోవర్ధన్, వినీత్‌రెడ్డి, ప్రసాద్, చరణ్, అఖిల్, తరుణ్, మహేందర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-02T23:46:05+05:30 IST