ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఎస్‌ నాయకుల కబ్జా నుంచి భూమిని కాపాడాలి

ABN, First Publish Date - 2023-02-21T23:34:37+05:30

శంషాబాద్‌ మండలంలోని సుల్తాన్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జాచేసిన భూమిని కాపాడాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం మండల రెవెన్యూ అధికారి శ్రీనివా్‌సరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రం అందజేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌, ఫిబ్రవరి 21: శంషాబాద్‌ మండలంలోని సుల్తాన్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జాచేసిన భూమిని కాపాడాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం మండల రెవెన్యూ అధికారి శ్రీనివా్‌సరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు జ్ఞానేశ్వర్‌, గడ్డం శేఖర్‌యాదవ్‌, జె.నరేందర్‌ మాట్లాడారు. సుల్తాన్‌పల్లి గ్రామంలో గతంలోనే పేదలకు ఇండ్ల స్థలాల కోసం ఈ భూమిని కేటాయించరని తెలి పారు. అయితే పేదలు పొజిషన్‌లోకి రాకుండా 25ఎకరాలను బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ధరణి పోర్టల్‌లో ఈ మొత్తం భూమిని తమ పేరిట ఎక్కించుకున్నారని అధికారికి వివరించారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకొని పేదలకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising