ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి

ABN, First Publish Date - 2023-02-01T23:38:48+05:30

వికారాబాద్‌ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని కలెక్టర్‌ నిఖిల అధికారులకు సూచించారు.

కలెక్టర్‌ నిఖిలను సన్మానిస్తున్న జిల్లాఅధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌, ఫిబ్రవరి1 : వికారాబాద్‌ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని కలెక్టర్‌ నిఖిల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్‌ బదిలీపై వెళుతున్న సందర్భంగా జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిదని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను చేపట్టడంలో సంతృప్తిని కలిగించిందని అన్నారు. జిల్లాలో క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లలో జిల్లా ముందంజలో ఉండడం అధికారుల కృషి ఫలితమన్నారు. మనఊరు- మనబడి కార్యయక్రమం, కంటివెలుగు విజయవంతంగా కొనసాగేందుకు కృషి చేస్తున్న విద్య, వైద్య శాఖ అధికారులను, సిబ్బందిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌ కుమార్‌, డీటీడబ్ల్యూవో కోటాజీ, డీఎస్సీ డీవో మల్లేశం, డీఈవో రేణుకాదేవి, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ మోజస్‌, డీఆర్‌డీవో కృష్ణన్‌, సీఈవో జానకిరెడ్డి, డీహెచ్‌ఎస్‌వో చక్రపాణి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్‌ కుమార్‌, ఆర్డీవో విజయ కుమారి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌ కుమార్‌, పశు వైద్య ఆరోగ్య అధికారి అనిల్‌ కుమార్‌, జిల్లా పౌర సరఫరాలాధికారి రాజేశ్వరి, జిల్లా మేనేజర్‌ విమల, డీపీర్‌వో ఆరీపోద్దీన్‌, ఎంపీడీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising