ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2023-09-21T23:20:20+05:30

వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ఘటన మండలంలోని రాంపూర్‌ గేట్‌ సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

బోల్తాపడిన కారు

ధారూరు, సెప్టెంబరు 21: వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ఘటన మండలంలోని రాంపూర్‌ గేట్‌ సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్న కారు రాంపూర్‌ గేట్‌ సమీపంలోని రాంశెట్టి పొలం వద్ద రోడ్డు మలుపులో వేగంగావస్తూ అదుపుతప్పి పల్టీలు కొడుతూ చెట్లపొదలోకి దూసుకెళ్లి గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సాయిప్రతాప్‌, సాయి సునీల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్‌ నుంచి తాండూరుకు కారులో వెళ్తున్న వారు గమనించి కారులో ఇరుకున్న వీరిద్దరిని బయటకు తీసి చికిత్స నిమిత్తం తాండూరుకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌ ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రుల వివరాలను సేకరించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2023-09-21T23:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising