కారు పల్టీ.. యువకుడి దుర్మరణం
ABN, First Publish Date - 2023-09-22T00:11:37+05:30
మంచాల చెర్వుకట్టపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మంచాల, సెప్టెంబరు 21: మంచాల చెర్వుకట్టపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంచాల గ్రామానికి చెందిన గడ్డం శివకుమార్(23) స్నేహితులు గ్యాక భగత్, ఏర్పుల అశోక్, మంచర్ల అనిల్, గ్యార గణేష్, సాతిరినవీన్‌లతో కలిసి మారుతీ ఆల్టో కారులో ఇబ్రహీంపట్నం వెళ్లి తిరుగు వస్తుండగా బుధవారం రాత్రి మంచాల రైతువేదిక దాటగానే అదుపుతప్పి చెరువుకట్టపై నుంచి పల్టీలు కొడుతూ కిందకి పడిపోయింది. క్షతగాత్రులను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించగా గడ్దం శివకుమార్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Updated Date - 2023-09-22T00:11:37+05:30 IST