ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్‌ కృషితోనే సాంకేతిక విప్లవం

ABN, First Publish Date - 2023-05-21T22:38:25+05:30

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కృషితోనే దేశంలో సాంకేతిక విప్లవం వచ్చిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌, తదితరులు అన్నారు.

షాద్‌నగర్‌ అర్బన్‌ : రాజీవ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వీర్లపల్లి శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు

ఘనంగా రాజీవ్‌గాంధీ వర్ధంతి.. నివాళులు

షాద్‌నగర్‌ అర్బన్‌/ఆమనగల్ల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/కందుకూరు/షాబాద్‌/చేవెళ్ల/యాచారం, మే 21: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కృషితోనే దేశంలో సాంకేతిక విప్లవం వచ్చిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌, తదితరులు అన్నారు. ఈమేరకు రాజీవ్‌ వర్ధంతిని పురష్కరించుకుని ఆదివారం షాద్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి వీర్లపల్లి శంకర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ తీసుకువచ్చిన సాంకేతిక విప్లవంతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలవుతోందని, యువతకు ఐటీ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. దేశం కోసం కాంగ్రెస్‌ నేతలు పాటుపడితే, సొంత లాభాల కోసం ఇతర పార్టీల నాయకులు పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అవినీతి పెరిగిందని, దీనివల్లే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయిందన్నారు. ఇక ముందు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వీర్లపల్లి ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వం తీసుకున్న చౌదరిగూడ మండలంలోని ఎదిర గ్రామానికి చెందిన బుడ్డమల్ల సంగీత పిడుగుపాటుకు గురై మరణించింది. ఆమె తల్లి మనీలాకు రూ.రెండు లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమాల్లో నాయకులు బాబర్‌, జి.బాల్‌రాజ్‌గౌడ్‌, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, చలివేంద్రం రాజు, జంగ నర్సింహ, చెంది తిరుపతిరెడ్డి, అందె మోహన్‌, ఖదీర్‌, ముబారక్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు కడెంపల్లి శ్రీనివా్‌సగౌడ్‌ షాద్‌నగర్‌లోని రాజీవ్‌ విగ్రహానికి తన అనుచరులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రాజీవ్‌ సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు కృష్ణగౌడ్‌, నర్సింహాగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, సోమ్లానాయక్‌, దినే్‌షసాగర్‌, మధు, సుధీర్‌, జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు తన జీవితాంతం పరితపించిన గొప్ప మహనీయుడు రాజీవ్‌ గాంధీ అని పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత రాజీవ్‌కే దక్కిందన్నారు. కడ్తాల మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బిచ్యానాయక్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్‌ గౌడ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యనాయక్‌, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను శ్రీనివా్‌సగౌడ్‌, నాయకులు గుర్తుచేశారు. రాజీవ్‌ ఆశయ సాధనకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌, నాయకులు రాంచందర్‌ నాయక్‌, హీరాసింగ్‌, షాబోద్దిన్‌, భానుకిరణ్‌, లక్ష్మయ్య, సత్యం, యాదవ్‌, శేఖర్‌, శ్రీను, రాజేశ్‌, ఇమ్రాన్‌బాబా, రాజేందర్‌గౌడ్‌, తులసీరామ్‌ శ్రీకాంత్‌, మహేశ్‌, భరత్‌, ప్రవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆమనగల్లు పట్టణంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మండ్లీ రాములు ఆధ్వర్యంలో రాజీవ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు వస్పుల మాణయ్య, నాయకులు కృష్ణనాయక్‌, శ్రీశైలం, రాఘవేందర్‌, అలీం, సురేశ్‌, రాజశేఖర్‌, మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు డోకూరు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, రాము లు, చెన్నకేశవులు, రవీందర్‌యాదవ్‌, అజీం, తదితరులు పాల్గొన్నారు. రాజీవ్‌గాంఽధీ నేతృత్వంలో యువతకు అనేక ఉపాఽధి అవకాశాలు కల్పించినట్లు యూత్‌ కాంగ్రెస్‌ కందుకూరు మండలాధ్యక్షుడు దంతోజు నర్సింహాచారి అన్నారు. ఆదివారం రాజీవ్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లోజు వినోద్‌చారితో కలిసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, ఏఎన్‌ఎంలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత రాజీవ్‌గాంధీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. నాయకులు లక్ష్మయ్య, మహేష్‌, శ్రీకాంత్‌, శివ, ప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందని డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పామెన భార్గవరామ్‌ అన్నారు. షాబాద్‌ మండలం నాగర్‌గూడలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. నాయకులు మాణిక్యం, రవీందర్‌, మహేందర్‌, ప్రభాకర్‌, రాజు, ప్రకాష్‌, దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. రాజీవ్‌ వర్ధంతి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలు అమోఘమన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. దేశంలో రాజీవ్‌ గాంధీ హయాంలోనే అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా పంచాయితీరాజ్‌ వ్యవస్థ బలోపేతం చేసేందుకుగాను చరిత్రాత్మకమైన చట్టం చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి పెంటయ్యగౌడ్‌, మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండాల రాములు, సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ మాణిక్యం, నాయకులు, శంకర్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా, రాజీవ్‌గాంధీ వర్ధంతిని కాంగ్రెస్‌ నాయకులు విస్మరించారు. యాచారం మండల కేంద్రంలో ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి ఉదయం 8గంటల ప్రాంతంలో రాజేష్‌ అనే యువకుడు తన అభిమానం కొద్ది విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి బంతిపూల దండ వేశాడు. అయితే, ఆ సమయంలో అక్కడున్న వారు ఫోటోలు తీస్తుండగా రాజేష్‌ వారిని వద్దంటూ సున్నితంగా తిరస్కరించాడు. అయితే, మేం కాంగ్రెస్‌ వాదులమని గొప్పలు చెప్పుకునే నాయకులు.. రాజీవ్‌కు నివాళులర్పించడం, అర్పించకపోవడం మాటేమిటోగానీ, ఈ యువకుడి అభిమానం మాత్రం వెలకట్టలేనిది. కాగా, మండల కేంద్రంలోని రాజీవ్‌ విగ్రహానికి ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు శ్రీకాంత్‌, నందకిషోర్‌ తదితరులు సాయంత్రం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2023-05-21T22:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising