ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైర్‌పర్సన్ల అవిశ్వాసంపై స్టే మరోనెల పొడిగింపు

ABN, First Publish Date - 2023-02-21T23:09:34+05:30

తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు స్వప్న, మంజులరమే్‌షలపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాసం, నోటీసులకు హైకోర్టు స్టేను మరో నెల రోజులపాటు పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు/వికారాబాద్‌, ఫిబ్రవరి21: తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు స్వప్న, మంజులరమే్‌షలపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాసం, నోటీసులకు హైకోర్టు స్టేను మరో నెల రోజులపాటు పొడిగించింది. అవిశ్వాసం నోటీసుపై తదుపరి చర్యలు వీలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని జనవరి 30న మున్సిపల్‌ చైర్‌పర్సన్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు మూడు వారాలు గడువు ఇవ్వగా, అట్టి గడువు మంగళవారంతో ముగిసింది. ప్రభుత్వం తరపున న్యాయవాది కౌంటర్‌ ఫైల్‌ వేసేందుకు మరింత సమయం కోరడంతో స్టేను మరో నెల రోజులపాటు పొడిగిస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చైర్‌ పర్సన్ల వర్గాలకు కొంత ఊరట లభించింది.

Updated Date - 2023-02-21T23:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising