ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం

ABN, First Publish Date - 2023-06-22T00:23:34+05:30

సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు.

శంషాబాద్‌ : అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజాప్రతినిధులు, నాయకులు

ఘనంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో పూజలు

షాద్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 21: సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎమ్మెల్యే షాదనగర్‌లోని క్రిష్టియన్‌ కాలనీలో గల ఎంబీ చర్చిలో ప్రార్థనలు చేశారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని రామేశ్వరంలోని రామలింగేశ్వరుడికి అభిషేకం చేసి, హోమంలో పాల్గొన్నారు. అనంతరం కొత్తూర్‌ మండలం జహంగీర్‌ పీర్‌ దర్గాలో ప్రార్థనలు చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్‌ వి.రాజావరప్రసాదరావు, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కందూటి నరేందర్‌, వైస్‌చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌, మాజీ చైర్మన్‌ విశ్వం, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, రామేశ్వరం సర్పంచ్‌ సంపత్‌కుమార్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ బక్కన్నయాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక సేవలో ఉన్న ఆనందం మరెక్కడా లభించదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అభిప్రాయపడ్డారు. రోడ్డు విస్తరణలో భాగంగా షాద్‌నగర్‌ పట్టణానికి ముఖద్వారంగా ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట ఉన్న గరుత్మంతుడు, ఆంజనేయస్వామి ఏక శిలా విగ్రహాన్ని పక్కన పెట్టి, బుధవారం పునఃప్రతిష్ఠ పూజ నిర్వహించారు. బక్కని నర్సింహులు పాల్గొన్నారు. ఆలయ స్థలం పరిరక్షణ కోసం భక్తులు ముందుకు రావడంతో ప్రహరీ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు దుర్గాప్రసాద్‌, జోత్స్న, కౌన్సిలర్లు అంతయ్య, ప్రతా్‌పరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు కిషోర్‌, లింగారెడ్డిగూడ ఎంపీటీసీ బీష్వ రామకృష్ణ, పట్టణ ప్రముఖులు పి. వెంకటసాయిశ్వర్‌రెడ్డి, జి. వసంతరావు, వెంకటనారాయణ, నర్సింహులుగుప్తా, కానుగు రాంభూపాల్‌, మంచిరేవుల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్తూర్‌ : కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాల వారికి సమాన గౌరవం లభిస్తుందని, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఇంతియాజ్‌లు అన్నారు. మండల పరిధిలోని జేపీ దర్గాను ఎమ్మెల్యేతో పాటు ఇంతియాజ్‌ దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్‌ మైనారిటీలను ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, ఇన్‌చార్జి ఎంపీపీ శోభలింగంనాయక్‌, షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైౖర్మన్‌ నరేందర్‌, తహసీల్దార్‌ రాములు, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, సర్పంచ్‌ అజయ్‌మిట్టునాయర్‌, ఉపసర్పంచ్‌ శ్రీరాములుయాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బి.దేవేందర్‌యాదవ్‌, పెంటనోళ్ల యాదగిరి, మెండె కృష్ణ, మన్నె నారాయణ, తస్లీం, గోపాల్‌నాయక్‌, ఇంద్రాసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొందుర్గు : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వైస్‌ ఎంపీపీ రాజేష్‌ పటేల్‌ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. అధికారులకు, గ్రామపెద్దలకు సన్మానం చేశారు. ఎంపీడీవో డాక్టర్‌ ఆంజనేయులు, తహసీల్దార్‌ రమే్‌షకుమార్‌, దేవాలయ కమిటీ చైర్మన్‌ గోపాల్‌, సర్పంచ్‌ ఆదిలక్ష్మీ యాదయ్య, ఉపసర్పంచ్‌ రాజా రమే్‌షరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మహేశ్వరం : ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహేశ్వరంలోని చారిత్రాత్మకమైన శ్రీ శివగంగ రాజరాజేశ్వరాలయంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాజరాజేశ్వర స్వామిని కోరినట్లు తెలిపారు. ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునితఅంద్యానాయక్‌, దేవాలయ కమిటీ చైర్మన్‌ సుధీర్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజునాయక్‌, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, నాయకులు చంద్రయ్యముదిరాజ్‌, నవీన్‌, గంట వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య, విఠల్‌నాయక్‌, రవినాయక్‌, డి. కృష్ణ, పాండుయాదవ్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

శంషాబాద్‌ : మున్సిపల్‌ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరై అయ్యప్ప స్వామి ఆలయం, మిషన్‌ కాంపౌండ్‌ ఎంబీ చర్చి, శంషాబాద్‌ ఏకే టౌన్‌షిప్‌ మసీదులో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దశదిశలా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌ గణేశ్‌, ఏఎంసీ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

కడ్తాల్‌ : గ్రామీణ ప్రాంతాల్లో పురాతన, నిరాదరణకు గురైన ఆలయాల అభివృద్ధి, నిత్య పూజలకు రాష్ట్ర ప్రభుత్వం దూప, దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పౌండర్‌ ట్రస్టీ సిరోలిపంతూ, ఈవో స్నేహలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిద మండలాలకుచెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, భక్తులు, దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పలు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, ఆలయ నిర్వాహకుడు రామావత్‌ భాస్కర్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, కల్వకుర్తి ఆర్డీవో రాజేశ్‌కుమార్‌, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మధుసూధనాచారి, సీడీపీవో సక్కుబాయి, అర్చకులు అమూల్యపతి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ సందర్శించి పూజలు చేశారు.

యాచారం : చౌదర్‌పల్లి గ్రామంలో పలువురు గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు శివాలయంలో హోమం నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అదేవిధంగా అన్నిగ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

శంషాబాద్‌రూరల్‌ : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. శంషాబాద్‌ మండలం నర్కూడ అమ్మపల్లి (శ్రీసీతారామచంద్రస్వామి) ఆలయంలో జడ్పీటీసీ తన్వీరాజు, మల్కారం పీఎ్‌ససీఎస్‌ చైర్మన్‌ సతీష్‌ అధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. స్వామివారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్‌, వైస్‌ఎంపీపీ నీలంనాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ వెంకటే్‌షగౌడ్‌, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ సిద్దులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు : తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కులమతాలకతీతంగా పరిపాలన కొనసాగిస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌లు అన్నారు. మండలంలోని గూడూరులో దేవాలయం, మసీదు, బాచుపల్లి గ్రామంలోని చర్చిలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, గూడూరు, బాచుపల్లి సర్పంచ్‌లు శ్రీలతశ్రీహరి, యాలాల శ్రీనివాస్‌, ఎంపీటీసీలు సురేష్‌, కాకి రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో హోమం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి, వైస్‌చైర్మన్‌ యాదగిరి, పలువురు కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లు తెలిపారు.

షాద్‌నగర్‌ : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జనసేన సమితి సాహిత్య సాంస్కృతిక సంస్థ పట్టణంలోని శివ మారుతి గీతా మందిరంలో నిర్వహించిన శ్రీ భద్రాద్రి రామ చరితం అనే నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంస్థ ప్రతినిధి డీఎస్‌ రాజు తన సహచరులతో కలిసి శ్రీరాముడి జీవిత చరిత్రను ప్రదర్శించారు. నాటక ప్రదర్శనను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ చైర్మన్‌ రాజావరప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎమ్మెస్‌ నటరాజ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అగ్గునూరు విశ్వం, విశ్వ హిందూ పరిషత్‌ నేత బండారు రమేష్‌ తదితరులు తిలకించారు.

Updated Date - 2023-06-22T00:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising