‘గృహలక్ష్మి’ దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేయాలి
ABN, First Publish Date - 2023-08-22T23:30:49+05:30
గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి శుక్రవారం వరకు ఆన్‌లైన్ డాటా ఎంట్రీ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
వికారాబాద్, ఆగస్టు 22: గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి శుక్రవారం వరకు ఆన్‌లైన్ డాటా ఎంట్రీ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఓటరు జాబితా నమోదు, గృహలక్ష్మి, హరితహారం తదితర అంశాలపై తహసీల్దార్, ఎంపీడీవోలతో అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహలక్ష్మి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈనెల 26న చేపట్టే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారించాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో 5మొక్కల కంటే తక్కువ కాకుండా చూడాలన్నారు. రోడ్లకు ఇరువైపులా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మంజూరైన 269 గ్రామపంచాయతీ భవనాల పనులు వేగవంతం చేసేందుకు వారంలో బేస్మెంట్ వరకు పనులు జరిగేలా చూడాలన్నారు. అదనంగా గ్రామ పంచాయతీ భవనాలకు ప్రతిపాదనలు వచ్చినట్లయితే పరిపాలన పరంగా మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీ భవనాలు సెప్టెంబర్ 30లోగా ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దళితబంధుకు మొదటి ప్రాధాన్యతనిస్తూ జాబితాలు అందిన ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తిచేసి ఆన్‌లైన్‌లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. ప్రభుత్వం కుల వృత్తులపై ఆధారపడ్డ కుటుంబాలకు అందించే ఆర్థిక సాయం జాబితాలపై కలెక్టర్ ఆరాతీశారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో డీఆర్డీవో కృష్ణన్, అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, బీసీడీవో ఉపేందర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివా్‌సరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ హుస్సేన్‌లు ఉన్నారు.
Updated Date - 2023-08-22T23:30:49+05:30 IST