ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సర్దార్‌ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం

ABN, First Publish Date - 2023-08-19T00:07:34+05:30

సర్దార్‌ సర్వాయి పాపన్నను జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

ఘట్‌కేసర్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహనికి పూల మాలలు వేసి నివాళి అర్పిస్తున్న మంత్రి మల్లారెడ్డి, తదితరులు

ఘట్‌కేసర్‌, ఆగస్టు 18: సర్దార్‌ సర్వాయి పాపన్నను జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం సర్దార్‌ సర్వాయి పాపన్న 373వ జయంతి పురస్కరించుకొని యంనంపేట్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పనిచేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దర్గా దయాకర్‌రెడ్డి, పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రెడ్డియా నాయక్‌, మండల రైతు సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ మాధవరెడ్డి, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్‌ గౌడ్‌, దాస్‌ గౌడ్‌, నాయకులు పి కొండల్‌రెడ్డి, భిక్షపతి గౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, సురేష్‌, నరేష్‌, కౌన్సిలర్లు స్థానికులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టరేట్‌లో సర్ధార్‌ సర్వాయీ పాపన్నగౌడ్‌ జయంతి వేడుకలు

మేడ్చల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సర్దార్‌ సర్వాయీ పాపన్నగౌడ్‌ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి పాపన్నగౌడ్‌ చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటనర్సయ్య, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌

వికారాబాద్‌: అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహా యోధుడు సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ కొనియాడారు. శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 373 జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, రాజ్యాధికార దిశగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న అని, సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీత కార్మికుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన ఎలాంటి అండద ండలు లేకుండా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి 12 మందితో ప్రారంభించి 12 వేల మంది సైన్యాన్ని తయారు చేసి గెరిల్లా పోరాటం చేశారని తెలిపారు. భూస్వాములు, మొగల్‌ వంశస్తులు శిస్తుల రూపంలో పన్నుల వసూళ్ల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచిపోరాం చేశారని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మహనీయులను గుర్తించి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, గృహలక్ష్మి పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతోందని ఆయన చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుశీల్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ, సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశ యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. కులవృత్తుల వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గీత కార్మికులకు పెన్షన్‌ ఇవ్వడంతో పాటు ప్రమాదవశాత్తు మరణిస్తే గీత బీమా పథకం కింద రూ.5లక్షలు బాధిత కుటుంబానికి అందజేస్తున్నట్లు తెలిపారు. దామాషా ప్రకారం గౌడ సామాజిక వర్గానికి మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్‌ కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీబీసీడబ్ల్యువో ఉపేందర్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌, ఎంపీపీ చంద్రకళ, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్‌, దళిత, బహుజన సంఘాల నాయకులు సంగీతపు రాజలింం, కృష్ణయ్య, దత్తు, విఠల్‌, రమేష్‌, బందయ్యగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, రాజేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-19T00:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising