ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంబురాల సంక్రాంతి

ABN, First Publish Date - 2023-01-15T00:13:08+05:30

వాకిట్లో రంగు రంగు చుక్కల ముగ్గులు.. చక్కని గొబ్బెమ్మలపై పువ్వులు.. భగభగ భోగి మంటలు.. హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్నల ఆటలు.. నోరూరించే పిండి వంటలు.. నింగిని తాకే గాలిపటాలు.. ఉత్సవంలా జరుపుకునే సంక్రాంతి రానే వచ్చింది.. ఇంటింటా సంబురాలు తీసుకొచ్చింది. నేడు సంక్రాంతి, రేపు కనుమను కన్నుల పండువగా జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యాయి. బంధుమిత్రులతో గ్రామాల్లో సందడి మొదలైంది. కాగా రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ ప్రజలు శనివారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున భోగి మంటలు వేసుకున్నారు. ముగ్గులతో వాకిళ్లను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం పుణ్య సాన్నాలు చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. పిల్లలకు భోగి పండ్లు పోసి దీవించారు. భోగభాగ్యాలు ప్రసాదించమంటూ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాడవాడలా భోగి మంటలు

ముగ్గులతో ఆకట్టుకున్న ముంగిళ్లు

పతంగుల ఎగరవేత

ప్రత్యేక పిండి వంటలు..

నేడు సంక్రాంతి, రేపు కనుమ

వాకిట్లో రంగు రంగు చుక్కల ముగ్గులు.. చక్కని గొబ్బెమ్మలపై పువ్వులు.. భగభగ భోగి మంటలు.. హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్నల ఆటలు.. నోరూరించే పిండి వంటలు.. నింగిని తాకే గాలిపటాలు.. ఉత్సవంలా జరుపుకునే సంక్రాంతి రానే వచ్చింది.. ఇంటింటా సంబురాలు తీసుకొచ్చింది. నేడు సంక్రాంతి, రేపు కనుమను కన్నుల పండువగా జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యాయి. బంధుమిత్రులతో గ్రామాల్లో సందడి మొదలైంది. కాగా రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ ప్రజలు శనివారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున భోగి మంటలు వేసుకున్నారు. ముగ్గులతో వాకిళ్లను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం పుణ్య సాన్నాలు చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. పిల్లలకు భోగి పండ్లు పోసి దీవించారు. భోగభాగ్యాలు ప్రసాదించమంటూ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

(ఆంధ్రజ్యోతి, ఉమ్మడి జిల్లా నెట్‌వర్క్‌, జనవరి 14) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం భోగి పండగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఉమ్మడి రంగారెడ్డి జిలా ప్రజలు తెల్లవారక ముందే చలి మంటలు వేసి బంధువులు, ఇరుగుపొరుగు వారితో కలిసి ఉత్సాహంగా భోగి వేడుకలు జరుపుకున్నారు. ఇంటిముంగిట కల్లాపి చల్లి ముత్యాల ముగ్గులు వేశారు. బాలికలు, మహిళలు ఇంటి ముంగిట్లో గొబ్బెమ్మలను ఆలంకరించడంతో కాలనీలు సందడిగా మారాయి. ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను ముగ్గులో పెట్టి పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించారు. రేగుపండ్లు, నవధాన్యాలను పెట్టారు. తీపి వంటలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి ముందు పాలు పొంగించారు. పిల్లలు, పెద్దలు పతంగులు ఎగువేస్తూ బిజీగా కనిపించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలతో గ్రామాల్లో సందడి నెలకొంది. నేడు సంక్రాంతి, రేపు కనుమ పండుగ చేసుకోన్నారు.

భోగి మంటలు

కందుకూరు మండలంలో తెల్లవారు జామున 35 గ్రామ పంచాయతీల్లోని ప్రధాన కూడల్లో భోగి మంటలను ఏర్పాటు చేశారు. కందుకూరులోని హైద్రాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై నవతరం యువజన సంఘం సభ్యులు భోగి మంటలను ఏర్పాటు చేశారు. చేవెళ డివిజన్‌లో చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌ గ్రామాల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆమనగల్లు, మహేశ్వరం, షాద్‌నగర్‌ నియోజవర్గాలల్లో ప్రజలు భోగి సంబురాలు నిర్వహించారు. కాగా బషీరాబాద్‌లో మర్రి అదిత్యరెడ్డి యువసేన ఆధ్వర్యంలో చిన్నారులకు తాండూరు డివిజన్‌ అధ్యక్షుడు జగదీష్‌ గాలిపటాలను పంపిణీ చేశారు. పండుగ సందర్భంగా టల పోటీలు కూడా నిర్వహించారు.

చిన్నారులకు భోగీ పళ్లు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భోగి రోజు తమ ఇళ్లల్లో చిన్నారులకు సాంప్రదాయ బద్దంగా భోగి పళ్లను పోశారు. ఐదు రకాల పళ్లను కలిపి చిన్నారుల తలపై నుంచి భోగి పండ్లను పోయడం ఆనవాయితీ. ఈ పళ్లు పోయడంతో పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సాంప్రదాయాన్ని వికారాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో పలు కుటుంబాలు కొనసాగించాయి.

ఆవుపేడ విక్రయం

తాండూరు, జనవరి14 : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అలంకరించేందుకు ఆవు పేడ అవసరం. అయితే గ్రామాల్లో ఆవుపేడకు కొదవ ఉండదు. కానీ తాండూరుపట్టణం భద్రేశ్వచౌక్‌లో శనివారం ఆవుపేడను విక్రయానికి పెట్టారు. దీనిని కొనేందుకు కొందరు మొగ్గు చూపారు. ఆవు పేడను కుప్పలుగా పెట్టి ఒక కుప్పకు రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయించారు.

ఆయాల్లో భక్తుల రద్దీ

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట కట్టమైసమ్మ, రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అలియాబాద్‌లోని శ్రీ రత్నాలయంలో భక్తుల కిక్కిరిసి పోయారు. అలాగే శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చెవెళ్లలో వేంకటేశ్వరాలయం, చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో భక్తులు పూజలు చేశారు. వికారాబాద్‌లోని అనంతగిరి పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-01-15T00:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising