ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల

ABN, First Publish Date - 2023-04-05T23:50:32+05:30

కలెక్టర్‌ హరీష్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సదరం క్యాంపులకు ఆన్‌లైన్‌ స్లాట్‌ మీసేవాలో బుకింగ్‌ తేదీలను విడుదల చేయడం జరిగిందని డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మీసేవలో స్లాట్‌ బుకింగ్‌ తేదీలు ప్రకటించిన డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 4 : కలెక్టర్‌ హరీష్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సదరం క్యాంపులకు ఆన్‌లైన్‌ స్లాట్‌ మీసేవాలో బుకింగ్‌ తేదీలను విడుదల చేయడం జరిగిందని డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగ నిర్ధారణ పరీక్షల కోసం మీసేవా ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని నిర్ణయించిన తేదీల్లో దివ్యాంగులు జిల్లాలోని కొండాపూర్‌, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రులకు వెళ్లాలని చెప్పారు. కొత్తగా దివ్యాంగ పరీక్షల కోసం వచ్చేవారు ఆధార్‌ కార్డుతో పాటు టెంపరరీ సర్టిఫికెట్‌ కలిగి ఉండి రెన్యూవల్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలనుకునే వారు పాత సదరం ఐడీ నెంబరుతో మీసేవ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని కోరారు. మీసేవ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న దరఖాస్తుల దారులకు మాత్రమే సదరం క్యాంపులో డాక్టర్‌ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదరం క్యాంపుకు కేవలం రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులని చెప్పారు.

సదరం షెడ్యూల్‌ ఇదే..

కొండాపూర్‌ ఆసుపత్రి : ఏప్రిల్‌ 11, 25 తేదీన ఆర్థోపెడిక్‌, మెంటల్‌ రిటార్డేషన్‌, మానసిక అనారోగ్యం, 18వ తేదీన ఆర్థోపెడిక్‌, దృష్టిలోపం ఉన్నవాళ్లు, వినికిడి లోపం ఉన్నవాళ్లు, 25తేదీన ఆర్థోపెడిక్‌, మెంటల్‌ రిటార్డేషన్‌, మానసిక అనారోగ్యం లేనివారు, కొండాపూర్‌ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 28వ తేదీన ఆర్థోపెడిక్‌ సమస్య ఉన్నవారు వనస్థలిపురం వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు దారులకు సంబంధిత డాక్టర్ల బృందం పరీక్షలు నిర్వహించి దివ్యాంగత్వ శాతాన్ని నిర్వహించిన పిదప సదరం సర్టిఫికెట్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మీసేవలో బుకింగ్‌ చేసుకున్న స్లిప్‌, నిర్ధారించిన తేదీల్లో వారికి సంబంధించిన ధ్రువ పత్రాలతో(ఆధార్‌ కార్డు, ఫొటో, రేషన్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డు) అలాగే వినికిడి లోపం గలవారు ప్రభుత్వం ఈఎన్టీ హైదరాబాద్‌ వారి ద్వారా సర్టిఫికెట్‌కు సంబంధించి డాక్టర్‌ రిపోర్టు, అంధత్వం ఉన్నవారు సరోజినిదేవి కంటి ఆసుపత్రి నుంచి టెస్టు రిపోర్టులు, బుద్ధి మాంద్యం, మానసిక దివ్యాంగులు ఎర్రగడ్డ రిపోర్టు తీసుకుని సదరం క్యాంపునకు హాజరు కావాలని ఆయన తెలిపారు.

Updated Date - 2023-04-05T23:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising