ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

ABN, First Publish Date - 2023-06-11T00:05:19+05:30

గ్రామీణ పాంత్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌/కొత్తూర్‌, జూన్‌ 10 : గ్రామీణ పాంత్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. షాబాద్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2 క్రికెట్‌ టోర్నమెంట్‌ను శనివారం స్థానిక పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియంలో ఆయన ప్రారంభించారు. గ్రామీణ యువకులు క్రీడల్లో రాణించి మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. క్రీడాకారులకు తమ సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, ప్రధానకార్యదర్శి శ్రీరాంరెడ్డి, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, జయమ్మవెంకట్‌రెడ్డి, గుండాల అశోక్‌, నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే క్రీడలు శరీర ధారుడ్యాన్ని పెంపొందిస్తాయని సీపీఐ రాష్ట్ర నాయకుడు పానుగంటి పర్వతాలు అన్నారు. వడ్డే సురేష్‌ జ్ఞాపకార్థం మండలం కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్‌ టోర్నీని ఆయన ప్రారంభించారు. క్రికెట్‌ టోర్నీ నిర్వహకులు వడ్డే రవి, చంటి, సురేష్‌, వెంకట్‌, రాజు, సురేందర్‌రెడ్డిలను పర్వతాలు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో హ్యూమన్‌రైట్స్‌ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ మోర కార్తిక్‌రెడ్డి, ఓం ప్రకాష్‌, జనార్ధన్‌, సీపీఐ నాయకులు ఎం.డీ షకీల్‌, గడ్డం గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising