ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్‌2 నుంచి రంగారెడ్డి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN, First Publish Date - 2023-05-06T00:26:47+05:30

రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌-2023 పోటీలు జూన్‌ 2వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డిస్ట్రిక్ట్‌ బ్యాడ్మింటన్‌అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కర్రెడ్ల శ్రీనివాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాదర్‌ఘాట్‌, మే 5(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌-2023 పోటీలు జూన్‌ 2వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డిస్ట్రిక్ట్‌ బ్యాడ్మింటన్‌అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కర్రెడ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఉప్పల్‌లోని గోవర్ధన్‌ బాడ్మింటన్‌అకాడమీలో జూన్‌ 2 నుంచి 4వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయన్నారు. అండర్‌13లో సబ్‌ జూనియర్‌ బాలురు, బాలికల సింగిల్స్‌, డబుల్స్‌, అండర్‌-15 సబ్‌ జూనియర్‌ బాలురు, బాలికలకు సింగిల్స్‌ డబుల్స్‌, అండర్‌-17లో బాలురు, బాలికలకు సింగిల్స్‌, డబుల్స్‌, అండర్‌-19లో జూనియర్‌, బాలురు, బాలికలకు సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. అలాగే ఓపెన్‌ టు ఆల్‌ విభాగంలో 40ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు సింగిల్స్‌, డబుల్స్‌, విభాగాల్లో పోటీలను జూన్‌ 2వ తేదీ, 3వ తేదీల్లో లీగ్‌లు, 4న అన్ని వయస్సుల వారికి ఫైనల్స్‌ నిర్వహిస్తామని వివరించారు.

ఆన్‌లైన్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు

పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని, ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు 778899 3006 లేదా 9848015443 అనే నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2023-05-06T00:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising