ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్‌గాంధీ యూత్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల పోస్టర్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2023-05-21T23:20:38+05:30

జూన్‌ 2న కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే రాజీవ్‌గాంధీ యూత్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో యువకులు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, మే 21: జూన్‌ 2న కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే రాజీవ్‌గాంధీ యూత్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో యువకులు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ క్విజ్‌కు సంబంధించి పోస్టర్‌ను ఆదివారం కులకచర్లలో విడుదల చేశారు. రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో బాధపడుతున్న సందర్భంలో ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకగాంధీ ఆధ్వర్యంలో యూత్‌ నిరుద్యోగ డిక్లరేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ యూత్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి నియోజకవర్గం వారిగా బహుమతులు అందజేస్తారని తెలిపారు. అత్యధికంగా యువకులు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోటీలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు, కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌-బి అధ్యక్షుడు భరత్‌కుమార్‌, ఎస్టీసెల్‌ జిల్లా నాయకులు విఠల్‌నాయక్‌, ఎంపీటీసీ ఆనందం, మండల కార్యదర్శి గోపాల్‌నాయక్‌, పార్టీ నాయకులు రాంచంద్రయ్య, గోవర్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌, జంగయ్య, మహేష్‌, అమృతయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-21T23:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising